-
-
Home » Mukhyaamshalu » Breaking News Live Updates Sunday 13th July 2025 Top news and Major Events Across India Siva
-

Breaking News: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు బృందం..
ABN , First Publish Date - Jul 13 , 2025 | 07:44 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 13, 2025 17:47 IST
సింగపూర్‌కు సీఎం చంద్రబాబు బృందం..
ఈ నెల 26 నుంచి 30వరకు సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బృందం టూర్
సీఎం చంద్రబాబు వెంట మంత్రులు, అధికారుల బృందం
బృందంలో మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్
-
Jul 13, 2025 17:47 IST
బాంబు బెదిరింపు..
కేరళ సీఎం విజయన్ నివాసానికి బాంబు బెదిరింపు
తిరువనంతపురంలో ఓ పోలీస్‌స్టేషన్‌కు ఇ-మెయిల్ పంపిన గుర్తుతెలియని వ్యక్తులు
నకిలీ ఇ-మెయిల్‌గా గుర్తించిన తిరువనంతపురం పోలీసులు
-
Jul 13, 2025 15:55 IST
పలు సంస్థలకు ఏపీ ప్రభుత్వం భూ కేటాయింపులు
కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయాలతో పలు సంస్థలకు భూ కేటాయింపులు
గతంలో భూములు కేటాయించిన 6 సంస్థలకు పలు సవరణలతో కేటాయింపులు
కొత్తగా 7 సంస్థలకు రాజధానిలో 32.40 ఎకరాల భూ కేటాయింపు
ఏపీ బీజేపీ ఆఫీస్‌కు రాజధానిలో 2 ఎకరాల భూ కేటాయింపు
60 ఏళ్ల లీజు ప్రాతిపదికన పలు సంస్థలకు భూ కేటాయింపు
గెయిల్, అంబికా సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులు రద్దు
గెయిల్‌కు కేటాయించిన 0.40 సెంట్లు, అంబికాకు ఎకరా భూమి కేటాయింపు రద్దు
-
Jul 13, 2025 15:35 IST
మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా?: ఎమ్మెల్సీ కవిత
ప్రజలపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఏంటి?: ఎమ్మెల్సీ కవిత
ఆడబిడ్డను ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.. మాండలికం అంటే ఎట్లా?: ఎమ్మెల్సీ కవిత
ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోం: ఎమ్మెల్సీ కవిత
ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోండి: ఎమ్మెల్సీ కవిత
తీన్మార్ మల్లన్న నాపై దారుణంగా మాట్లాడారు: కవిత
వెంటనే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలి: ఎమ్మెల్సీ కవిత
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి విచక్షణతో మాట్లాడాలి: ఎమ్మెల్సీ కవిత
-
Jul 13, 2025 15:27 IST
కోట అంతిమయాత్ర ప్రారంభం..
హైదరాబాద్: కోట శ్రీనివాసరావు అంతిమయాత్ర ప్రారంభం
ఫిల్మ్‌నగర్ నివాసం నుంచి కోట శ్రీనివాసరావు అంతిమయాత్ర
మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంతిమసంస్కారాలు
-
Jul 13, 2025 12:10 IST
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి
గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపిన మల్లన్న గన్‌మెన్
మల్లన్న కార్యాలయంపై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దాడి
-
Jul 13, 2025 12:05 IST
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సీఎం రేవంత్
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
సీఎం వెంట మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్
-
Jul 13, 2025 12:04 IST
కృష్ణా: పెడన నియోజకవర్గంలో హైఅలర్ట్
సాయంత్రం పెడనలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
గుడివాడలో జరిగిన వైసీపీ, టీడీపీ వివాదంతో పోలీసుల పహారా
పెడన వైసీపీ సమావేశానికి మాజీ మంత్రి పేర్ని నాని వెళ్లకుండా..
ఆయన నివాసం దగ్గర భారీగా మోహరించిన పోలీసులు
-
Jul 13, 2025 10:57 IST
కోట శ్రీనివాస్ సినిమాలు చూసే స్పూర్తి పొందాను: ప్రకాష్ రాజ్
కోట గారి సినిమాలు చూసె స్పూర్తి పొందాను.
ఎన్నో సినిమాల్లో కలిసి నటించాను.
విశిష్ట మైన వ్యక్తి.
అందరికీ నచ్చడు.
ఎవరిని మెప్పించటానికి ప్రయత్నం చేయరు.
ఆయనది ఒక ప్రజెన్స్.
తనదైన వ్యంగ్యం ఉండేది.
తెలుగు ప్రతిభకు చాన్స్ దొరకటం లేదని అనగానే తొలుత నాకు భాద వేసింది.
కానీ ఆ తరువాత వారి బాధ నిజమే అని అర్ధమయింది.
ప్రకాష్ రాజ్ తెలుగువారు కాదు కదా అంటే.. తెలుగు మాట్లాడతాడు.. పరాయివాడు కాదు అనేవారు.
నాపై కూడా ఛలోక్తులు విసిరేవారు.
ఈ మధ్య ఫోన్ చేశా.
మాతో కలిసి ఓ సినిమా సెట్లో గడిపారు.
వారి ఇంట్లో జరిగిన పెయిన్‌ను బయట ఎక్కడా చూపెవారు కాదు.
వారి వ్యక్తిత్వం నాకు ఎంతో ఇష్టం.
-
Jul 13, 2025 09:22 IST
తమిళనాడు: తిరువళ్లూరులో ఘోర ప్రమాదం
డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు
పూర్తిగా కాలిపోయిన అన్ని బోగీలు
ట్రాక్ సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయిస్తున్న అధికారులు
అరక్కోణం నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్ రైలు
పలు రైళ్లను నిలిపివేసిన అధికారులు
పెరియకుప్పం సమీపంలో ఘటన
-
Jul 13, 2025 08:16 IST
కోట శ్రీనివాసరావు మృతిపై కేసీఆర్ సంతాపం
సినీ రంగం గొప్ప నటుడిని కోల్పోయింది: కేసీఆర్
కోట కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: కేసీఆర్
-
Jul 13, 2025 08:14 IST
కోట శ్రీనివాసరావు మృతిపై మంత్రి నారా లోకేష్ సంతాపం
విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు కోట జీవం పోశారు: లోకేష్
ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత కోటదే: లోకేష్
కోట శ్రీనివాసరావు మరణం సినీ రంగానికి తీరని లోటు
కోట కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: లోకేష్
-
Jul 13, 2025 08:13 IST
కోట శ్రీనివాసరావు మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
కోట శ్రీనివాసరావు మరణం విచారకరం: చంద్రబాబు
కోట కళాసేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయం
కోట మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు: చంద్రబాబు
-
Jul 13, 2025 08:12 IST
తనికెళ్ల భరణి సంతాపం..
కోట శ్రీనివాసరావుతో కలిసి అనేక నాటకాలు చేశా: తనికెళ్ల భరణి
తపన, నిబద్ధతతో కోట శ్రీనివాసరావు పనిచేశారు: తనికెళ్ల భరణి
కోట సినీ ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగింది: తనికెళ్ల భరణి
-
Jul 13, 2025 08:11 IST
అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ..
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) కన్నుమూత, కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు, తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన కోట శ్రీనివాసరావు, కోట శ్రీనివాసరావు మృతిపై సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు
-
Jul 13, 2025 08:10 IST
'ప్రతిఘటన' సినిమాతో విలన్‌గా మంచి గుర్తింపు
'ఆహ! నా పెళ్లంట' సినిమాతో తిరుగులేని నటుడిగా కోట
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు
సినిమాల్లోకి రాకముందు స్టేట్‌బ్యాంక్‌లో పనిచేసిన కోట
1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నిక
-
Jul 13, 2025 08:10 IST
1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట
1978లో 'ప్రాణం ఖరీదు' సినిమాతో అరంగేట్రం
750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు
4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట
తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ నటించిన కోట
ప్రతిఘటన సినిమాతో విలన్‌గా మంచి గుర్తింపు
2015లో పద్మశ్రీ అవార్డు అందుకున్న కోట శ్రీనివాసరావు
కోట శ్రీనివాసరావుకు 9 నంది అవార్డులు, సైమా అవార్డు
-
Jul 13, 2025 08:10 IST
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) కన్నుమూత
కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు.
తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన కోట శ్రీనివాసరావు.
కోట శ్రీనివాసరావు మృతిపై సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు.
మ.2గంటలకు మహాప్రస్థానంలో కోట అంత్యక్రియలు.
-
Jul 13, 2025 07:44 IST
అమరావతి: మాజీమంత్రి పేర్నినాని ఫోన్ సంభాషణ లీక్
కూటమి, వైసీపీ నేతల మధ్య జరిగిన గొడవకు.. కులం రంగు పులిమి వివాదం చేయాలని పేర్ని నాని యత్నం.
వీడియో ద్వారా బయటపడ్డ లోకేష్‌పై బురదజల్లాలన్న పన్నాగం.
బీసీ మహిళపై దాడి జరిగిందంటూ అందరితో కలిసి గోల చేయించాలి.
లోకేష్ డైరెక్షన్‌లో టీడీపీ ఎమ్మెల్యే చేయించారంటూ.. ఏపీ వ్యాప్తంగా ఆందోళన చేయించాలి: ఫోన్ కాల్‌లో పేర్ని నాని.
లీడర్ (జగన్) చెప్తే మనవాళ్లు జనాల్లోకి బాగా తీసుకెళ్తారు: పేర్ని నాని