Screen Time Effects on Skin: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్.. స్ర్కీన్ టైం తగ్గించుకోకపోతే ఈ చర్మ సమస్యలు..!
ABN , Publish Date - Jul 26 , 2025 | 02:55 PM
స్మార్ట్ గ్యాడ్జెట్ల ముందు గంటల కొద్దీ గడిపేవారికి అలర్ట్. అధిక సమయం తదేకంగా స్క్రీన్ చూస్తూ గడిపితే ఈ చర్మ సమస్యలు తప్పవు. స్మార్ట్ ఫోన్ బ్లూ లైట్ నుంచి మీ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి.

మన జీవితాలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాల చుట్టూనే తిరుగుతున్నాయి. వర్చువల్ తరగతులకు హాజరయ్యే స్కూలు విద్యార్థులు మొదలుకుని ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ కనిపిస్తోంది. బయట చిన్న దుకాణాలు లేదా కూరగాయల మార్కెట్‌కు వెళ్లినా ఫోన్ ద్వారానే పేమెంట్లు చేస్తున్నారు. ఇంటా బయటా ప్రతి చిన్న పనికీ ఫోన్ పైనే ఆధారపడుతున్నారు ప్రజలు. సోషల్ మీడియా పుణ్యమా అని అవసరానికి మించి తమకు తెలియకుండానే స్క్రీన్లకు రోజులో ఎక్కువ భాగం అతుక్కుపోతున్నారు. కానీ, ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లు జీవితాన్ని ఎంత సులభతరం చేస్తున్నాయో.. అంతే వేగంగా మీ చర్మ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి.
అధిక స్క్రీన్ సమయం మీ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్మార్ట్ ఫోన్ నుంచి వెలువడే నీలి కాంతి నేరుగా కళ్లపై పడి చూపును దెబ్బతీయడం మాత్రమే కాదు. మీ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది కూడా సూర్యకాంతి లాగానే చర్మాన్ని డ్యామేజ్ చేస్తుందని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఇది సూర్యుడి నుండి వచ్చే UV కిరణాల కంటే ఎక్కువగా చర్మం లోలోతుల్లోకి చొచ్చుకుపోతుంది. చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా కొల్లాజెన్, ఎలాస్టిన్ అనే రెండు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా చర్మంపై సన్నని గీతలు, నీరసం నల్లటి మచ్చలు, అకాల వృద్ధాప్య సంకేతాలను కనిపిస్తాయి.
చాలా మంది ఇంట్లో ఉంటే చర్మం దెబ్బతినకుండా సురక్షితంగా ఉంటుందని నమ్ముతారు. కానీ ఇది ఇప్పుడు నిజం కాదు. ఎందుకంటే, కానీ నేడు, మనం వాడే స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇళ్లలోని LED లైట్ల నుంచి చర్మానికి హాని కలిగించే కాంతి ప్రసరిస్తుంది. అధికారిక నివేదికల ప్రకారం ప్రజలు రోజుకు సగటున 6 నుంచి 10 గంటలు స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. ఉదాహరణకు, ఫోన్ నుంచి నీలి కాంతిని HEV (హై-ఎనర్జీ విజిబుల్) లైట్ అని కూడా పిలుస్తారు. ఇది సూర్యకాంతిలోనూ ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే కేవలం నీలి కాంతి వల్లే స్కిన్ డ్యామేజ్ కాదు. పైన పేర్కొన్న అన్ని పరికరాలను అధిక సమయం వినియోగిస్తే హైపర్ పిగ్మెంటేషన్, ఆక్సిడేషన్ స్ట్రెస్, అకాల వృద్ధాప్యం, నల్ల మచ్చలు, నీరసించిన చర్మం, రెటీనా దెబ్బతినడం, కళ్లు పొడిబారడం సహా అనేక సమస్యలు వస్తాయి.
చర్మాన్ని రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ డిజిటల్ ప్రపంచంలో పూర్తిగా స్క్రీన్ టైమింగ్ నివారించడం అసాధ్యం. అందుకే బ్లూ లైట్ నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు నైట్ మోడ్‌లో ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించాలి.
ఐరన్ ఆక్సైడ్, విటమిన్ సి లేదా నియాసినమైడ్ వంటి పదార్థాలు కలిగిన మంచి చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం.
ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం మంచిది.
ప్రజలు స్క్రీన్ నుంచి క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలి. అప్పుడప్పుడు దూరంగా ఉంచితే కళ్ళు, చర్మం రెండింటికీ విశ్రాంతి లభిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
ఇతరులకు చెడు చేసేవాళ్లు ఎందుకు సంతోషంగా కనిపిస్తారు.. షాకింగ్ రీజన్స్ ఇవే..
టూర్‌లపై వెళ్లే వారు తమ సూట్‌కేసుల్లో పెట్టకూడని వస్తువులు ఇవీ