Share News

Sleep Position: నిద్రపోయే భంగిమకు, ఆరోగ్యానికి లింకేంటి.. ఏ వైపు తిరిగి పడుకుంటే ఏమవుతుంది..

ABN , Publish Date - Apr 21 , 2025 | 10:50 AM

Best Sleep Position For Health: ఆరోగ్యానికి నిద్ర ఎంత ముఖ్యమో.. ఏ భంగిమలో పడుకుని నిద్రిస్తున్నాం అన్నది కూడా అంతే ముఖ్యం. ఒకవేళ మీరు గనక తప్పుడు భంగిమలో నిద్రించే అలవాటు ఉంటే హెల్త్ కోసం ఎంత కేర్ తీసుకున్నా ప్రయోజనం ఉండదు. అందుకే ఏ వైపు తిరిగి పడుకుంటే మంచిదో తెలుసుకోండి.

Sleep Position: నిద్రపోయే భంగిమకు, ఆరోగ్యానికి లింకేంటి.. ఏ వైపు తిరిగి పడుకుంటే ఏమవుతుంది..
Best Sleep Position For Health

Health Effects Of Sleeping Position: రోజంతా పని చేసిన అలసిన శరీరానికి, మనసుకు రిలీఫ్ ఇచ్చేది ప్రశాంతమైన నిద్ర మాత్రమే. ఇలాంటి స్థితిలో రాత్రి మంచంపై పడుకున్న వెంటనే హాయిగా అనిపించి ఇట్టే నిద్ర పట్టేస్తుంది. గాఢనిద్రలోకి జారుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నది ఎంత నిజమో.. సరైన భంగిమలో పడుకోకపోతే అనారోగ్యం పాలవుతామన్నదీ అంతే నిజమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అవును, కంటినిండా సరిపడినంత సేపు నిద్రపోవడం ఒక్కటే సరిపోదు. ఎటు పక్క తిరిగి పడుకుంటున్నాం.. ఎంత సేపు గాఢ నిద్ర పోతున్నాం అన్నది కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మరి, మీరు ఎటు వైపు తిరిగి పడుకుంటున్నారో చెక్ చేసుకోండి. ఏ భంగిమలో నిద్రపోతే ఏం జరుగుతుందనేది తెలుసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.


పక్కకి పడుకుంటే..

మీరు ఎడమ లేదా కుడివైపు తిరిగి పడుకుంటే గురక సమస్య తగ్గుతుంది. శరీరానికి గాలి తగిలేందుకు అవకాశం ఉండటం వల్ల త్వరగా నిద్రపడుతుంది. స్లీప్ అప్నియా సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఎడమ వైపు పడుకోవడం వల్ల శరీరంలో చిక్కుకున్న గాలి బయటకు వెళ్లిపోయి యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట సమస్యలు సద్దుమణుగుతాయి. దీనితో పాటు మెడ, వెన్నునొప్పి కూడా తగ్గుతాయి. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో అంతర్గత అవయవాలపై ఒత్తిడిని తగ్గించడానికి, రక్త ప్రవాహాన్ని సరిగ్గా ఉండటానికి ఎడమ వైపు పడుకోవడం మంచిది.


వెల్లకిలా పడుకుంటే..

వెల్లకిలా పడుకోవడం వల్ల వెన్నెముక సహజ ఆకృతిని కాపాడుకోవచ్చు. మెడ, వెన్నునొప్పి కూడా తగ్గిపోతాయి. ఈ భంగిమలో నిద్రిస్తే వెన్నెముక, కీళ్లపై ఒత్తిడి నియంత్రణలోకి వస్తుంది. వెన్నునొప్పి లేదా ఇతర వెన్నెముక సమస్యలు ఉన్నవారు ఈ పొజిషన్ ఎంచుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ సమస్య ఉన్నావారు వెల్లకిలా పడుకుని మోకాళ్లు పైకెత్తి పాదాలు కిందకి ఆన్చి పడుకోవాలి. అప్పుడు వెన్నునొప్పి శాంతిస్తుంది. అయితే వీపు మొత్తం మంచానికి ఆన్చి పడుకోవడం వల్ల గురక, స్లీప్ అప్నియా మరింత తీవ్రమవుతాయి. ఎందుకంటే ఇది వాయుమార్గాన్ని అడ్డుకుంటుంది. దీనితో పాటు గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ సమస్య కూడా తీవ్రమవుతుంది.


బోర్లా పడుకుంటే..

బోర్లా పడుకోవడం వల్ల వెన్నెముక, మెడ, వీపుపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల నొప్పి తీవ్రం కావచ్చు. పొట్ట మీద పడుకోవడం వల్ల తరచుగా మెడ మెలితిరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు భరించలేని మెడ నొప్పి కలగవచ్చు. ఇంకా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ భంగిమలో పడుకోవడం మానేస్తే మంచిది.


Read Also: Morning Walk Tips: మార్నింగ్ వాక్‍కు వెళ్లే ముందు ఈ పొరపాట్లు చేయకండి..

Mushroom Cleaning Tips: వండేముందు పుట్టగొడుగులను ఎలా శుభ్రం చేయాలి..

Fridge Odor Remover: క్లీన్ చేసినా ఫ్రిజ్ దుర్వాసన వస్తోందా.. ఈ టిప్స్‌తో ఈజీగా

Updated Date - Apr 21 , 2025 | 11:05 AM