Share News

Quick Lunch Ideas: లంచ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదా.. 5 ఫాస్ట్ రెసిపీ ఐడియాస్ మీకోసమే..

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:27 PM

బిజీగా ఉండి లంచ్ చేసుకోవడానికి సమయం కేటాయించలేకపోతున్నారా? ఆరోగ్యకరమైన ఇంటి భోజనానికి దూరమవుతున్నామనే బాధపడుతున్నవారి కోసమే ఈ 5 లంచ్ రెసిపీస్. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా చాలా వేగంగా ఈ సూపర్ హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు.

Quick Lunch Ideas: లంచ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదా.. 5 ఫాస్ట్ రెసిపీ ఐడియాస్ మీకోసమే..
healthy lunch ideas for office

నిత్యం బిజీ లైఫ్ గడిపేవారికి తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని ఇంట్లో తయారుచేసుకోవడానికి సమయం ఉండదు. ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో బయటి ఫుడ్ తినాల్సి వస్తుంది. దీనివల్ల డబ్బు వేస్ట్ కావడంతో పాటు అనారోగ్యకర ఆహారం తింటున్నామోనన్న భయమూ ఉంటుంది. ఇలాంటివారు చాలా సులభంగా, వేగంగా ఇంట్లోనే లంచ్ కోసం ఈ 5 రెసిపీలను తయారు చేసుకోవచ్చు. ఇండియన్స్ కోసం పోషకాహార నిపుణులు సూచిస్తున్న సూపర్ హెల్తీ ఫుడ్ రెసిపీస్ మీకోసం.


చాలామందికి ఆఫీసుకు వెళ్లేటప్పుడు భోజనం చేసేందుకు తగినంత సమయం ఉండదు. నిత్యం కాల్స్, టార్గెట్స్ మధ్య గడిపేస్తుంటారు. అయితే, ఎంత బిజీగా ఉన్నప్పటికీ వంటగదిలో ఉండే ఈ సాధారణ ఇంగ్రిడియెంట్స్‌తోనే వేగంగా లంచ్ తయారు చేసుకోవచ్చు. 30 నిమిషాల కంటే తక్కువ సమయలోనే చేయగలిగే 5 సూపర్ హెల్తీ రెసిపీస్ కింద ఉన్నాయి.


వెజిటబుల్ కిచిడీ

ఇది బియ్యం, పప్పులు, కూరగాయలతో తయారుచేసే సింపుల్ అండ్ హెల్తీ వంటకం. దీన్ని తయారుచేయడం చాలా సులభం. అధిక పోషకాలు ఉండే ఈ ఆహారం తిన్న తర్వాతా కడుపు తేలికగా ఉంటుంది. బిజీ షెడ్యూల్ తో సతమతమయ్యేవారికి ఇది సరైన ఎంపిక. ఇది ప్రెజర్ కుక్కర్ లేదా ఇన్‌స్టంట్ పాట్‌లో త్వరగా ఉడుకుతుంది. ఇంట్లో ఉండే ఏ కూరగాయలతో అయినా వండుకోవచ్చు.

పెరుగన్నం

దక్షిణ భారతదేశ ప్రజలు ఎక్కువగా తినే వంటకం. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దీన్నెలా తయారుచేసుకోవాలంటే.. వండిన అన్నంతో పాటు పెరుగు కలుపుకోవాలి. తరువాత ఆవాలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి పోపు వేసుకుంటే చాలు. రెడీ అయిపోతుంది. వేడి అధికంగా ఉండే వేసవిలో ఇది బెస్ట్ ఫుడ్. కావాలంటే తురిమిన క్యారెట్లు, దోసకాయ, ద్రాక్ష లేదా దానిమ్మ గింజలను కూడా ఇందులో కలుపుకోవచ్చు.


గుడ్డు కూర

గుడ్లు తినే వారు తక్కువ మసాలాలు, ఉల్లిపాయ-టమోటా గ్రేవీతో కూడిన గుడ్డు కూర ఒక బెస్ట్ ఆప్షన్ ఎంపిక. అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీని తయారీకి ఎక్కువ శ్రమ అవసరం లేదు.

పనీర్ బుర్జీ

ఉల్లిపాయలు, టమోటాలు, సుగంధ ద్రవ్యాల్లో వేయించిన పనీర్ చాలా బాగుంటుంది. మీరు దీన్ని గోధుమ రొట్టెతో కలిపి తినవచ్చు. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఆఫీస్ డెస్క్ వద్ద పనిచేసుకుంటూ తినడమూ సులభం.


బేసన్ చిల్లా విత్ చట్నీ

శనగపిండి లేదా బేసన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సుగంధ ద్రవ్యాల మసాలాలు జోడించిన పిండిని పెనంపై దోశలా వేసుకోవాలి. దీన్ని పుదీనా లేదా కొబ్బరి చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. గ్లూటెన్ రహితం. మంచి రుచి, పోషకాల కోసం పనీర్ లేదా పాలకూరతో రోటీలో వేసుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

రైళ్లలో లగేజీకి కూడా రూల్స్ ఉన్నాయి.. అప్రమత్తంగా ఉండండి

ఇంట్లో ఎలుకలను చంపకుండా వదిలించుకోవడం ఎలా?
For More
Lifestyle News

Updated Date - Aug 02 , 2025 | 01:27 PM