Share News

Biryani: రంగు రంగుల బిర్యానీ.. రుచిగా ఉందని తిన్నారంటే..

ABN , Publish Date - Aug 02 , 2025 | 11:49 AM

ఒకప్పుడు బిర్యానీ అంటే నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితం. ప్రస్తుతం బిర్యానీ సెంటర్లు మండల కేంద్రాల నుంచి ఓ మోస్తరు పెద్ద గ్రామాలకూ విస్తరించాయి. బిర్యానీ అంటే చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా భుజించడానికి ఇష్టపడతారు. ఇదే అవకాశంగా తక్కువ ధర అంటూ కూల్‌డ్రింక్స్ ఉచితం అంటూ రకరకాల ఆఫర్లతో..

Biryani: రంగు రంగుల బిర్యానీ.. రుచిగా ఉందని తిన్నారంటే..

  • నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్న హోటళ్లు

  • డబ్బులు ఇచ్చి జబ్బులను ఆహ్వానిస్తోన్న ఆహారప్రియులు

  • నిబంధనల ఊసే కరువు.. పత్తాలేని ఫుడ్ సేఫ్టీ విభాగం


బాపట్ల: పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల సందర్శనకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. పర్యాటక శాఖ ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుండగా, వీటికి భక్తులు, పర్యాటకుల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. ఇదే అవకాశంగా కొందరు ఓ ముఠాగా ఏర్పడి ఆన్‌లైన్ మోసాలకు తెరతీశారు. ఆన్లైన్లో గదులు బుక్ చేసుకోవాలనుకునే వారే లక్ష్యంగా నకిలీ వెబ్‌సైట్లతో ఆకట్టుకుని భక్తులు, పర్యాటకులను దోచేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఫిర్యాదులు చేసినా.. అధికారులు పట్టించుకోకపోవడంతో ఎంతో కాలంగా ఈ ముఠా ఆటలు యథేచ్ఛగా సాగాయి. టీటీడీతో పాటు శ్రీశైలం, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ దేవస్థానాలను కూడా వదలకుండా ఈ ముఠా సైబర్ నేరాలకు పాల్పడింది. సూర్యలంక పర్యాటకులు బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దేశవ్యాప్తంగా అనేక పర్యాటక ప్రదేశాల్లో ఈ తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. 18 రాష్ట్రాల పరిధిలో 127 ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసు విచారణలో తేలినా విచారణ మాత్రం బాపట్ల రూరల్ పీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగానే జరగడం గమనార్హం.


ఒకప్పుడు బిర్యానీ అంటే నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితం. ప్రస్తుతం బిర్యానీ సెంటర్లు మండల కేంద్రాల నుంచి ఓ మోస్తరు పెద్ద గ్రామాలకూ విస్తరించాయి. బిర్యానీ అంటే చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా భుజించడానికి ఇష్టపడతారు. ఇదే అవకాశంగా తక్కువ ధర అంటూ కూల్‌డ్రింక్స్ ఉచితం అంటూ రకరకాల ఆఫర్లతో ఆహార ప్రియులను ఆకర్షిస్తూ బిర్యానీ సెంటర్లను విస్తరిస్తున్నారు. జిల్లా కేంద్రాలైన గుంటూరు, బాపట్ల, నరసరావుపేటలతో పాటు మున్సిపల్ పట్టణాల్లో కరోనా అనంతరం వందల సంఖ్యలో బిర్యానీ సెంటర్లు వెలిశాయంటే వాటికి ఉన్న డిమాండ్ అర్థమవుతోంది. అందరికీ అందుబాటు ధరలో లభ్యమవుతోన్న బిర్యానీలో నాణ్యత ఎంత అంటే ఎవరూ చెప్పలేరు. లాభార్జనే ధ్యేయంగా కాసుల వేట సాగిస్తున్న నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాలను పణంగా పెడుతున్నారు. కనులకు ఇంపుగా ఉండడం కోసమో, కృత్రిమ రుచుల కోసమో బిర్యానీతో పాటు ఇతర మాంసాహార వంటకాలలో విపరీతంగా ప్రమాదకరమైన రంగులు కలుపుతున్నారు. వీటిని కలపడం వల్ల ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలను వినియోగదారులు కొని మరీ తింటున్నారు. వాడిన నూనెనే తిరిగి వాడడం మొదలుకుని, అపరిమితంగా ఫుడ్ కలర్ వాడడం వల్ల ప్రజల ఆరోగ్యాలకు ఎన్నో అనర్థాలు వాటిల్లుతున్నాయి. నాణ్యత విషయంలో తోపుడుబండ్ల దగ్గర నుంచి కాస్ట్ రెస్టారెంట్ల వరకు అదే దారి పెద్ద రెస్టారెంట్ల వైపు కన్నెత్తి చూడని అధికారులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని తూతూమంత్రంగా తనిఖీలు చేపడుతున్నారన్న విమర్శలున్నాయి.దందా ఏదీ సదరు విభాగానికి కనబడకపోవడం మరింత విస్మయపరిచేదిలా ఉంది.


డబ్బులు ఇచ్చి మరీ రోగాలకు ఆహ్వానం

రెస్టారెంట్లు మొదలుకుని రోడ్డు పక్కన హోటళ్ల వరకు జిల్లా వ్యాప్తంగా వేలల్లో ఉన్నాయి. ఇందులో అధికారికంగా రిజిష్టర్ అయినవి 20 శాతంలోపే. వీటిలో పెద్ద చిన్నా అన్న తేడా లేకుండా చాలావరకు హోటళ్లు, ఫుడ్, బిర్యానీ సెంటర్లలో ఆహార భద్రత నిబంధనలను పాటించే వారే లేరు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో రోజువారీ ఓపీల్లో దాదాపు 14 శాతం ఫుడ్ పాయిజన్ సమస్యగానే నమోదవడం కల్తీ తీవ్రతకు అద్దం పడుతోంది. గ్యాస్ట్రో ఎంట్రాలజీ కేసులు కూడా పెద్దఎత్తున వస్తున్నాయి. నాణ్యత లేని ఆహార పదార్థాలతో గుండె, నరాలు, ఎముకల సమస్యలు తలెత్తడంతో పాటు చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని వైద్యులు గుర్తించారు. కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాలతో క్యాన్సర్ పొంచి ఉంది. పదార్థాల్లో కలిపేకెమికల్స్ వల్ల మహిళల్లో రుతుసంబంధమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వేడివేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లు, బకెట్లు, డబ్బాల్లో ప్యాక్ చేస్తుండటం వల్ల కూడా క్యాన్సర్ కారక పదార్థాలను కొని మరీ తింటున్నారు.


నిబంధనల ఊసే లేదు

ఆహార పదార్థాల్లో కల్తీని నివారించడానికి ఏర్పాటు చేసిన ఆహార భద్రత, ప్రమాణాల చట్టం అమలు గురించి ఆలోచించే వారే లేరు. నిత్యం తనఖీలు చేపట్టి నిబంధనలు అమలవుతున్నాయో పరిశీలించి.. కల్తీలను అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సేఫ్టీ అదికారులు బాధ్యతను విస్మరిస్తున్నారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం 19 నిబంధనలు పాటించాలి. కానీ ఏ హోటల్, ఫుడ్ సెంటర్‌లో వీటి జాడే కనబడదు. కల్తీ, కలుషిత, విష తుల్య ఆహార పదార్థాలను అడ్డుకోవాలన్న ఆలోచన ఆయా శాఖాధికారుల్లో లోపించింది. ఆహార పదార్థాలను నిత్యం పరిశీలిస్తూ కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హోటళ్లలో వినియోగించే రంగుల డబ్బాలు, టేస్టింగ్ సాల్ట్ ప్యాకెట్లు బహిరంగంగానే దర్శనమిస్తున్నా అధికారులకు అవి కనబడడం లేదు. పెద్దఎత్తున బిర్యానీ హోటళ్లు వెలసి, రకరకాల ఆఫర్లు, కల్తీరంగులతో వినియోగదారులను ఆకర్షిస్తుంటే ఈ కల్తీదందా ఏదీ సదరు విభాగానికి కనబడకపోవడం మరింత విస్మయపరిచేదిలా ఉంది.

Updated Date - Aug 02 , 2025 | 11:50 AM