Share News

Pune Gym Death: జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తూ మృతి

ABN , Publish Date - Aug 02 , 2025 | 11:45 AM

ప్రస్తుత కాలంలో రోజురోజుకు హార్ట్ ఎటాక్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. వయస్సు తేడా లేకుండా‎ చిన్న వయస్సు పిల్లల నుంచి పెద్ద వారి వరకు అనేక మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు జి‎మ్‎లో వర్క్ అవుట్ చేస్తూ మృతి చెందాడు.

Pune Gym Death: జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తూ మృతి
Pune Gym Death

ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్న వయస్సులోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ దుర్ఘటన ఆలోచించేలా చేస్తుంది. పూణేలోని పింప్రి-చించ్‌వాడ్‌లో ఒక జిమ్‌లో శుక్రవారం 37 ఏళ్ల మిలింద్ కులకర్ణి అనే యువకుడు వ్యాయామం చేసిన తర్వాత నీళ్లు తాగాడు. ఆ క్రమంలోనే కళ్లు తిరిగి ఒక్కసారిగా కింద పడిపోయాడు.


డాక్టర్ల ప్రకారం

దీంతో జిమ్‌లో ఉన్నవాళ్లు వెంటనే గమనించి అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కానీ, ఆస్పత్రికి చేరే సమయానికే మిలింద్ కులకర్ణి మరణించాడు. డాక్టర్లు చెప్పిన ప్రకారం, అతనికి గుండెపోటు వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మిలింద్ భార్య స్వయంగా ఒక డాక్టర్ కావడం విశేషం. గత ఆరు నెలలుగా అతను రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్తున్నాడని తెలిసింది.


ఇలాంటి సంఘటనలు

ఈ సంఘటన అనేక మందిని కలచివేస్తుంది. ఆ యువకుడు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని జిమ్‌కి వెళ్లాడు. కానీ, అతని జీవితం అక్కడే ఆగిపోయింది. ఇలాంటి సంఘటనలు అనేక మందిలో భయాన్ని, ఆందోళనను పెంచుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇలాంటి ఊహించని మలుపులు వారి జీవితాలను మార్చేస్తాయని చెప్పవచ్చు.


గుండెపోటు కేసులు

సాధారణంగా 65 ఏళ్లు దాటిన వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువని చెబుతుంటారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గత కొన్నేళ్లలో 50 ఏళ్ల లోపు వయసున్న వారిలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం, 30 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారికి గుండెపోటు రావడం ఆందోళనకరంగా మారింది.

ఆహారపు అలవాట్లు

మన జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి ఇవన్నీ ఈ సమస్యకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. జిమ్‌లో వ్యాయామం చేయడం మంచిదే, కానీ మన శరీరం స్థితిని బట్టి అతిగా కూడా చేయకూడని అంటున్నారు. ఎక్కువ అలసట, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 02:58 PM