Vijayadashami: విజయదశమి రైళ్లకు రిజర్వేషన్ ప్రారంభం
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:10 AM
దేశప్రజలు అక్టోబరు 1,2 తేదీల్లో ఆయుధ పూజ, విజయదశమి పండుగలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకార్యర్ధం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ముందుస్తు రిజర్వేషన్ శనివారం నుంచి ప్రారంభమైంది. ప్రజల సౌకర్యార్ధం ప్రయాణానికి 60 రోజులు ముందుగా రైలు టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.

చెన్నై: దేశప్రజలు అక్టోబరు 1,2 తేదీల్లో ఆయుధ పూజ, విజయదశమి(Vijayadashami) పండుగలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకార్యర్ధం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్(IRCTC Website) ముందుస్తు రిజర్వేషన్ శనివారం నుంచి ప్రారంభమైంది. ప్రజల సౌకర్యార్ధం ప్రయాణానికి 60 రోజులు ముందుగా రైలు టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆ ప్రకారం, సెప్టెంబరు 30వ తేది ప్రయాణానికి శనివారం (ఆగస్టు 1వ తేది) రిజర్వేషన్ ప్రారంభమైంది.
అక్టోబరు 1వ తేదీ ప్రయాణానికి ఆదివారం, అక్టోబరు 2వ తేదీ ప్రయాణానికి సోమవారం, అక్టోబరు 3వ తేదీ ప్రయాణానికి మంగళవారం, అక్టోబరు 4వ తేదీ ప్రయాణానికి బుధవారం, అక్టోబరు 5వ తేదీ ప్రయాణానికి గురువారం, అక్టోబరు 6వ తేదీ ప్రయాణానికి శుక్రవారం ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి అన్నిరకాల రిజర్వేషన్ ప్రారంభం కానుందని దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే
సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!
Read Latest Telangana News and National News