Belly Fat: డైలీ 10 నిమిషాలు ఈ పనిచేయండి.. బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది..!
ABN , Publish Date - Jul 29 , 2025 | 02:43 PM
బరువు తగ్గడం కంటే పొట్ట చూట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడం చాలా కష్టం. ప్రస్తుతం ఎక్కువగా అందరినీ బాధపెడుతున్నది ఈ బెల్లీ ఫ్యాట్ సమస్యే. ఇందుకో చక్కని పరిష్కారముంది. రోజూవారీ అలవాట్లలో కొద్ది మార్పులు చేసుకుంటే కచ్చితంగా నాజూగ్గా తయారవుతారని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు.

Easy Weight Loss Tips: ప్రస్తుతం ప్రతి ఇద్దరిలో ఒకరు ఊబకాయం బారిన పడుతున్నారు. బిజీ లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి. ఒకే చోట గంటల తరబడి పనిచేయడం వల్ల నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఇది చూసేందుకు అందవికారంగా కనిపించడమే కాకుండా అనేక అనారోగ్యాలకు హేతువుగా మారుతోంది. సాధారణంగా, సహజ పద్ధతిలో బరువు తగ్గడానికి ముందుగా జంక్ ఫుడ్‌ను మానేయాలని డైటీషియన్లు సిఫార్సు చేస్తారు. కానీ, ప్రతిరోజూ 10 నిమిషాలు ఈ పని చేయడం ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. అలాగే, రోజువారీ అలవాట్లలో ఈ 6 సూత్రాలను తప్పక అనుసరించాలి.
తగినంత నిద్ర
త్వరగా బరువు తగ్గడానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. తగినంత నిద్ర లేకపోతే ఆకలిని నియంత్రించే హార్మోన్లకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల అతిగా తినడం ప్రారంభిస్తారు. ఇది అధిక బరువుకు దారితీస్తుంది. అందుకే, ఊబకాయాన్ని నియంత్రించడానికి కచ్చితంగా ప్రతిరోజూ 7-9 గంటలు నిద్రపోండి.
తేలికపాటి కార్యకలాపాలు
వర్కౌట్లు కాకుండా ఇతర కార్యకలాపాలు చేయడం ద్వారా కూడా బరువు తగ్గించుకోవచ్చు. వీలైతే జిమ్‌తో పాటు చేయండి. లేకపోతే రోజూ 7,000 అడుగులు నడవడం. స్టెప్స్ ఎక్కడం లక్ష్యంగా పెట్టుకోవాలి.
ధ్యానం
త్వరగా ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి ఒత్తిడి లేకుండా ఉండాలని ఫిట్ నెస్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎక్కువసేపు ఒత్తిడిలో ఉండటం వల్ల కడుపు, దాని చుట్టుపక్కల ప్రాంతంలో కొవ్వు పేరుకుపోతుంది. అందుకే, ఒత్తిడిని తగ్గించడానికి ప్రతిరోజూ 10 నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఇది అద్భుతంగా పని చేస్తుంది.
జంక్ ఫుడ్
ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే ఏదైనా తినే అలవాటును మార్చుకోండి. మీరు నిజంగా బరువు తగ్గాలనుకుంటే తక్షణమే జంక్ ఫుడ్ డైట్లో నుంచి తీసేయండి.
క్రాష్ డైట్లు
క్రాష్ డైట్స్ కొంతకాలం బరువు తగ్గడానికి సహాయపడవచ్చు. కానీ దీర్ఘకాలంలో అది మీ జీవక్రియను దెబ్బతీస్తుంది. ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి ఒక వ్యక్తి తన రోజువారీ అలవాట్లలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం.
హైడ్రేటెడ్‌గా ఉండండి
బరువు తగ్గడానికి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నిజానికి తినడానికి ముందు నీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఈ అలవాటు అతిగా తినకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
అల్యూమినియం పాత్రల్లో ఇన్నేళ్లకు మించి వండితే కిడ్నీ సమస్యలు..!
హైదరాబాద్ సమీపంలో అద్భుత జలపాతం.. వర్షాకాలంలో అస్సలు మిస్సవకండి.