Share News

Parenting Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల చదువును పాడు చేస్తాయి..

ABN , Publish Date - Apr 19 , 2025 | 01:13 PM

Morning Mistakes Of Parents Imposed on Kids Studies: తల్లిదండ్రులు ఉదయాన్నే చేసే తప్పులు వారి పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. పాఠశాలకు వెళ్లిన తర్వాత మీ బిడ్డ చదువుపై దృష్టిపెట్టడం లేదని ఫిర్యాదు చేస్తున్నా.. వారు ఒంటరిగా, పరధ్యానంలో, విచారంగా ఉంటున్నా.. చదువంటే ఇష్టంలేనట్టు వ్యవహరిస్తున్నా ఇవే కారణం..

Parenting Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల చదువును పాడు చేస్తాయి..
Parenting Mistakes

Parents Routines Impacts Kids Studies: కొందరు పిల్లలు ఎంత తెలివిగా, చురుగ్గా ఉంటున్నా చదువంటే మాత్రం ఆమడ దూరం పారిపోతుంటారు. స్కూలుకు వెళ్లినప్పటి నుంచి మీ బిడ్డ చదువుపై దృష్టి పెట్టడం లేదని పదే పదే టీచర్ ఫిర్యాదు చేస్తుంటే.. అది కేవలం వారి తప్పు మాత్రమే కాదు. వారి తల్లిదండ్రులది కూడా. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధాసక్తులు తగ్గడం వెనక కొన్ని బలమైన కారణాలే ఉన్నాయి. ఉదయాన్నే పేరెంట్స్ అనుసరించే ఈ అలవాట్లే వారి బిడ్డల్లో ఏకాగ్రతను దూరం చేసి పరధ్యానంలోకి నెట్టుతున్నాయి. కాబట్టి, పిల్లలు ఉదయాన్నే సంతోషంగా పాఠశాలకు వెళ్లి బాగా చదవాలంటే.. పేరెంట్స్ ఈ తప్పులు చేయడం మానుకోవాలి.


బ్రేక్‌ఫాస్ట్

స్కూలుకు టైం అయిపోతుందని.. బస్సు అందుకోలేమని చాలామంది పిల్లలు త్వరత్వరగా బ్రేక్‌ఫాస్ట్ పూర్తిచేస్తారు లేదా మధ్యలోనే తినడం ఆపేసి ఉరుకుల పరుగుల మీద వెళ్లిపోతారు. ఈ అలవాటు పిల్లల శరీరంలో చక్కెర స్థాయిని పెంచడమే కాకుండా వారు నీరసంగా మారిపోతారు. స్కూలుకు వెళ్లాక టీచర్ చెప్పే పాఠాలపై ఏకాగ్రత పెట్టలేక ఇబ్బందిపడతారు. త్వరగా నేర్చుకోలేరు. ఎక్కువ సమాచారాన్ని గ్రహించలేరు. అదీగాక, ఈ సమయంలో పిల్లల మెదడు అభివృద్ధి దశలోనే ఉంటుంది. కాబట్టి, తమ బిడ్డలకు సరైన పోషకాహారం తప్పక అందేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన అల్పాహారం ప్రతిరోజూ కడుపునిండా తినిపించండి. తద్వారా వారి రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు ఏర్పడవు. బద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.


నిద్ర

పిల్లలకు పెద్దల కంటే ఎక్కువ నిద్ర అవసరం. పిల్లలు ఉదయం పూట ఏకాగ్రత లేకపోవడానికి అతిపెద్ద కారణం నిద్ర లేకపోవడం. పిల్లవాడు ఏడున్నర నుంచి ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోతే.. ఉదయం పూట వారికి చిరాకుగా ఉండటమే కాకుండా మనస్సు కూడా ప్రశాంతంగా ఉండదు. ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోతారు. కాబట్టి, పిల్లలకు తగినంత నిద్రపోయేలా చేయడానికి పేరెంట్స్ రోజూ ఓ క్రమపద్ధతిలో నిద్రపోయేలా స్థిరమైన నిద్రవేళలు సెట్ చేయాలి. వారాంతాల్లో కూడా వారిని నిద్రపుచ్చడం, మేల్కొలపడం వంటి దినచర్యలను పాటించండి. తద్వారా పిల్లవాడు హాయిగా నిద్రపోతారు. ఉదయం లేవగానే శరీరం, మనస్సు కొత్త ఉత్సాహంతో మేల్కొంటుంది.


టీవీ, మొబైల్

మీ అబ్బాయి లేదా అమ్మాయి పాఠశాలకు వెళ్లే ముందు టీవీ లేదా మొబైల్ స్క్రీన్‌లతో సమయం గడుపుతుంటే అది వారి ఆలోచనలను మళ్లిస్తుంది. స్క్రీన్ ఆఫ్ చేసిన తర్వాత పిల్లల మనస్సు ఏకాగ్రత పెట్టడానికి సమయం పడుతుంది. దీని కారణంగా వారు తరగతి గదిలో కూర్చున్నప్పుడు ఆ వాతావరణంలో ఇమడలేరు. చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టంగా మారుతుంది.


హడావిడి

ఎక్కువమంది తల్లిదండ్రులు ప్రతిరోజూ ఉదయాన్నే ఉదయం యూనిఫాం ధరించడం, సిద్ధం కావడం, అల్పాహారం తినడం వంటి ప్రతి విషయంలో వారిని తిడుతూనే స్కూలుకు సిద్ధం చేస్తుంటారు. ఈ రకమైన ప్రవర్తన వారి పిల్లల మనస్సును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన కూడిన వాతావరణంలో దినచర్య ప్రారంభించడం వల్ల స్కూలుకు వెళ్లగానే వారి మెదడు విశ్రాంతి కోరుకుంటుంది. స్థిరంగా క్లాసులో కూర్చోలేక పాఠాలు వినటంలో ఇబ్బందిపడతారు.


డీహైడ్రేషన్

చాలాసార్లు పిల్లలకు దాహం వేస్తుంది కానీ వారు అర్థం చేసుకోలేరు. ఉదయం లేచినప్పటి నుంచి చాలామంది తల్లిదండ్రులు పనుల్లో పడిపోయి తమ పిల్లలకు తగినంత నీరు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి డీహైడ్రేషన్‌ కారణంగా పిల్లలకి ఏకాగ్రతలో సమస్యలు రావడం మొదలవుతుంది.


Read Also: Tan Removal Tips: రోజూ ఈ లోషన్ వాడితే ట్యానింగ్ సమస్య ఎప్పుడూ రాదు..

Food Hacks: కిచెన్‌లో ఒక్క రోజులో పాడయ్యే ఆహార పదార్థాలు.. జాగ్రత్త తీసుకోకపోతే అంతేసంగతి..

Chanakya Niti: ఈ వ్యక్తులకు దూరంగా ఉంటేనే జీవితం

Updated Date - Apr 19 , 2025 | 09:23 PM