Share News

India Russia Oil Trade: భారత-రష్యా చమురు డీల్స్‌పై.. ట్రంప్ సర్కార్ ఒత్తిడి

ABN , Publish Date - Aug 04 , 2025 | 08:21 AM

భారత్-రష్యా చమురు వాణిజ్యం, అమెరికా టారిఫ్‌లు, ఒత్తిడి వ్యూహాలు ఇప్పుడు గ్లోబల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో తాజాగా భారత్, రష్యాతో చమురు కొనుగోలు విషయంపై ట్రంప్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.

India Russia Oil Trade: భారత-రష్యా చమురు డీల్స్‌పై.. ట్రంప్ సర్కార్ ఒత్తిడి
India Russia Oil Trade

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం (India Russia Oil Trade). ఈ కారణంగా ట్రంప్ సీనియర్ అడ్వైజర్ స్టీఫెన్ మిల్లర్ కూడా తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా ఆర్థిక సహాయం చేస్తోందని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేయాలని ట్రంప్ గట్టిగా చెప్పారని మిల్లర్ అన్నారు.


కొనుగోలు చేసి ఫైనాన్స్..

భారత్, రష్యా నుంచి చమురు కొంటూ ఈ యుద్ధానికి ఫైనాన్స్ చేయడం ఏమాత్రం ఒప్పుకోలేని విషయమని స్టీఫెన్ మిల్లర్ ఓ మీడియా షోలో పేర్కొన్నారు. అంతేకాదు, భారత్, రష్యా నుంచి చమురు కొనే స్థాయి చైనాతో సమానంగా ఉందని, ఇది చాలా షాకింగ్ విషయమని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

టారిఫ్ బెదిరింపులు

జూలై 30న ట్రంప్ భారత్‌పై 25% టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొంటున్నందుకు భారత్‌ను టార్గెట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, భారత్, రష్యాలను డెడ్ ఎకానమీస్ అని ఆరోపించారు. భారత్ రష్యాతో ఏం చేసినా పట్టించుకోనని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోకపోతే, రష్యా చమురు కొనే దేశాలపై 100% టారిఫ్‌లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.


భారత్ రియాక్షన్

అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనడం ఆపే సూచనలు కనిపించడం లేదు. భారత ప్రభుత్వ వర్గాలు రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. 2021లో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్‌లో కేవలం 3% చమురు మాత్రమే రష్యా నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 35-40%కి పెరిగింది.

మోదీ-ట్రంప్ బంధం

అయితే స్టీఫెన్ మిల్లర్ ట్రంప్-మోదీ సంబంధాల గురించి ప్రస్తావించారు. ట్రంప్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీతో అద్భుతమైన సంబంధం ఉందని గుర్తు చేశారు. ఈ స్నేహపూరిత వ్యాఖ్యలు కాస్త ఊరటనిచ్చినప్పటికీ, చమురు వాణిజ్యం విషయంలో మాత్రం ఇండియాపై ఒత్తిడి తగ్గేలా కనిపించడం లేదు.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 08:23 AM