Trump-Ambani Meet: ట్రంప్‌తో అంబానీ దంపతులు
ABN , Publish Date - Jan 19 , 2025 | 09:18 PM
ముకేష్ దంపతులు జనవరి 18న అమెరికా చేరుకుని ట్రంప్ ఏర్పాటు చేసిన 'క్యాండిల్ లైట్' డిన్నర్‌లో పాల్గొన్నారు. కాగా, వాషింగ్టన్‌లో జరిగిన ప్రైవేటు విందులో ట్రంప్‌తో ముకేష్ దంపతులు భేటీ అయ్యారని, ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారని రిలయెన్స్ ఫౌండేషన్ వెల్లడించింది.

వాషింగ్టన్: అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ (Donala Trumph)ను భారత్ నుంచి ముఖ్య అతిథులుగా హాజరవుతున్న ముకేష్ అంబానీ, నీతా అంబానీ (Mukesh Ambani and Nita Ambani) ఆదివారంనాడు కలుసుకున్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేష్ అంబానీ తన సతీమణితో సహా ట్రంప్‌ను కలుసుకున్న ఫోటో బయటకు వచ్చింది.
Donald Trumph: ట్రంప్ ప్రమాణస్వీకారం వేదిక మార్పు.. 40 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి
ముకేష్ దంపతులు జనవరి 18న అమెరికా చేరుకుని ట్రంప్ ఏర్పాటు చేసిన 'క్యాండిల్ లైట్' డిన్నర్‌లో పాల్గొన్నారు. కాగా, వాషింగ్టన్‌లో జరిగిన ప్రైవేటు విందులో ట్రంప్‌తో ముకేష్ దంపతులు భేటీ అయ్యారని, ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారని రిలయెన్స్ ఫౌండేషన్ వెల్లడించింది.
కాగా, ట్రంప్ ప్రమాణస్వీకార వేదకపై ముకేష్, నీతు అంబానీకి ప్రత్యేక స్థానం కేటాయించినట్టు తెలుస్తోంది. ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి గత ఏడాది వివాహం కాగా, దేశ విదేశాల ప్రముఖులు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. ట్రంప్ కుమార్త్ ఇవాంక ట్రంప్, ఆమె భార్య జార్డ్ కుష్నర్, పెద్ద కుమార్తె అరబెల్లా రోజ్ సైతం పాల్గొన్నారు.
Read More International News and Latest Telugu News