Share News

Trump Key announcement: ఇక వ్యోమగాములు వచ్చేస్తారా.. ట్రంప్ సందేశం ఇదే

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:16 PM

Trump Key announcement: ఎనిమిది రోజుల టూర్‌‌‌కి వెళ్లి దాదాపు తొమ్మిది నెలలుగా ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయారు ఆస్ట్రోనాట్స్ సునితీ విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌. అంతరిక్షం నుంచి భూమి మీదకు వీరి రాకకు సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

Trump Key announcement: ఇక వ్యోమగాములు వచ్చేస్తారా.. ట్రంప్ సందేశం ఇదే
Donald Trump Key announcement

వాషింగ్టన్, మార్చి 7: గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో చిక్కుకుపోయిన వ్యోమగాములకు సంబంధించి అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఐఎస్‌ఎస్‌ నుంచి ‘మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వస్తున్నాం’ అంటూ సందేశం పంపించారు అమెరికా ప్రెసిడెంట్. భార‌తీయ సంత‌తి వ్యోమ‌గామి సునీతా విలియమ్స్‌ (Sunita Williams)తో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ (Butch Wilmore) కొన్ని నెలలుగా ఐఎస్‌ఎస్‌లో ఉండిపోయిన విషయం తెలిసిందే. కేవలం ఎనిమిది రోజుల టూర్ కోసం వెళ్లిన ఆ ఇద్దరు దాదాపు తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. వారిని తీసుకొచ్చేందుకు రిస్క్యూ టీం సిద్ధమైనట్లు ట్రంప్ వెల్లడించారు.


ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అంతరిక్షంలో ఉండిపోయిన ఇద్దరు వ్యోమగాములను త్వరలోనే భూమి మీదకు తీసుకొస్తామని చెప్పారు. వారు అంతరిక్షంలో చిక్కుకుపోడానికి గత అమెరికా అధ్యక్షులు బైడెన్ కారణమంటూ వ్యాఖ్యలు చేశారు. అసమర్ధుడైన బైడన్ పాలన కారణంగానే ఆ ఇద్దరు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయినట్లు ఆరోపించారు. ఆ ఇద్దరిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ సహాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు మస్క్‌ కూడా సానుకూలంగా స్పందించారని.. స్పేస్ స్టేషన్‌లో చిక్కుకున్న ఆస్ట్రోనాట్స్‌ను భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మరో రెండు వారాల్లో ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్స్‌ భూమి మీదకు వచ్చేస్తారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. స్పేస్‌లో ఉన్న సునీత విలియమ్స్‌ శిరోజాలపై కూడా అమెరికా ప్రెసిడెంట్ ప్రశంసలు కురిపించారు. సునీత కురులు చాలా బలంగా, దట్టంగా ఉన్నాయని.. ఈ విషయంలో తానేమీ జోక్ చేయడం లేదని ఆయన తెలిపారు.

Teacher Beats Students: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం


కాగా... ముందుగా అనుకున్న ప్రకారం ఐఎస్‌ఎస్‌లో ఉన్న సునీత విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌‌లు కేవలం వారం రోజుల్లోనే భూమి మీదకు చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. అప్పటి నుంచి వారిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు స్పేస్ ఎక్స్‌తో కలిసి నాసా పనిచేస్తోంది. ఇటీవల స్పేస్ నుంచి వ్యోమగాములు మీడియాతో మాట్లాడుతూ.. స్పేస్‌ ఎక్స్‌కు చెందిన క్రూ-10 అంతరిక్షనౌక తమను తీసుకెళ్లేందుకు వస్తోందని.. ఆ నౌకలోనే తాము తిరిగి భూమి మీదకు రానున్నట్లు వ్యోమగాములు తెలిపారు. స్పేస్‌లో ఉన్న సునీత ఇప్పటి వ‌ర‌కు 62 గంట‌ల 6 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేశారు. తాజాగా ట్రంప్ ప్రకటనతో అతి త్వరలోనే ఆ ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి...

Janasena leaders criticize Ambati: వైసీపీ పాకిస్థాన్.. కూటమి ఇండియా.. జనసేన నేతల ఫైర్

CBI: వివేకా వాచ్‌మన్‌ రంగయ్య మృతిపై కేసు నమోదు

Read Latest International News And Telugu News

Updated Date - Mar 07 , 2025 | 01:19 PM