Share News

Taiwan Slams China: జపాన్ వేడుకల్లో తైపీ జెండాల తొలగింపు.. చైనా చర్యపై తైవాన్ ఆగ్రహం

ABN , Publish Date - Jul 28 , 2025 | 10:53 AM

చైనా తమపై చేస్తున్న అన్యాయపు దాడి గురించి తైవాన్ మరోసారి చాటి చెప్పింది. ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమంలో కూడా చైనా.. తైవాన్ జెండాలను తొలగించేలా చేసిందని ఆరోపించింది.

Taiwan Slams China: జపాన్ వేడుకల్లో తైపీ జెండాల తొలగింపు.. చైనా చర్యపై తైవాన్ ఆగ్రహం
Taiwan Slams China

తైవాన్ తనపై జరుగుతున్న అన్యాయంపై మరోసారి గళమెత్తింది (Taiwan Slams China). ఇటీవల ఒక అంతర్జాతీయ సాంస్కృతిక ఈవెంట్‌లో కూడా తమ దేశ జెండాను తొలగించి, తైవాన్ పేరు స్థానంలో చైనీస్-తైపీగా మార్చారని తైవాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి ప్రధాన కారణం చైనా జోక్యం అని తైవాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఈ చర్య తమ దేశ గౌరవాన్ని తగ్గించేలా ఉందని, ఇది చైనా రాజకీయ కుట్రకు ఓ ఉదాహరణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై చైనా తరచూ తైవాన్‎ను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని, ఇది మరోసారి స్పష్టమైందని వెల్లడించింది. ఈ వివాదం మరోసారి తైవాన్-చైనా మధ్య సంబంధాలను ప్రస్తావిస్తుంది.


పోటీలో వివాదం

ఇటీవల జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన అంతర్జాతీయ గాయక బృంద పోటీలో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో చైనా రాజకీయ ఒత్తిడిని చూపించిందని తైవాన్ నిరసన తెలిపింది. చైనా జోక్యం వల్ల నిర్వాహకులు తైవాన్ జెండాను తొలగించి, దేశం పేరును చైనీస్-తైపీగా మార్చారని తైవాన్ ఆరోపించింది. ఈ సంఘటన కళాకారుల మనోభావాలను దెబ్బతీయడమే కాదు, సాంస్కృతిక వేదికలను కూడా రాజకీయ స్థలంగా మార్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి.


తైవాన్ కళాకారుల సత్తా

ఈ పోటీలో పాఠశాల పిల్లల నుంచి వయోజనుల వరకు తైవాన్ నుంచి ఆరు గాయక బృందాలు పాల్గొన్నాయి. చైనా అధికారులు తైవాన్ పేరును చైనీస్-తైపీగా మార్చమని, జాతీయ జెండాను తొలగించమని నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చారు. శనివారం సాయంత్రం ఈ విషయం తైవాన్ ప్రతినిధి కార్యాలయానికి తెలిసింది. వెంటనే వారు ఒక ఎమ్మెల్యేను నిర్వాహకులతో మాట్లాడటానికి పంపారు. కానీ చైనా ఒత్తిడి ముందు నిర్వాహకులు తలొగ్గి, అన్ని జెండాలను తొలగించి, తైవాన్ పేరును మార్చారు.


జపాన్ మద్దతు

జపనీస్ ఎంపీ కీజీ ఫురుయా తైవాన్ తరపున నిలబడి నిర్వాహకులతో మాట్లాడారు. తైవాన్ గుర్తింపును కాపాడాలని కోరారు. కానీ చైనా ఒత్తిడి ముందు నిర్వాహకులు దిగొచ్చారు. ఈ సంఘటన సాంస్కృతిక కార్యక్రమాన్ని రాజకీయ ఆటస్థలంగా మార్చిందని తైవాన్ ప్రతినిధి కార్యాలయం ఆవేదన వ్యక్తం చేసింది. గత ఆరు సంవత్సరాలుగా తైవాన్ తమ ఒరిజినల్ పేరుతోనే ఈ పోటీలో పాల్గొంటున్నట్లు తెలిపింది.

సంగీతంలో రాజకీయాలు ఎందుకు?

సంగీతం సరిహద్దులను దాటి అందరినీ ఒక్కటి చేసే కళ అని తైవాన్ ప్రతినిధి కార్యాలయం స్పష్టం చేసింది. చైనా ఈ కళను కూడా రాజకీయ ఆయుధంగా మార్చడం దారుణమని విమర్శించింది. యువ కళాకారులను ప్రోత్సహించేందుకు 16 మంది ప్రతినిధుల బృందాన్ని ఈ కార్యక్రమానికి పంపారు. వారు కళాకారులకు మద్దతుగా నిలిచి, వారి మనోధైర్యాన్ని కాపాడారు.


ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 10:56 AM