Share News

Jaishankar Meet US Secrtary: టారిఫ్ వివాదాల వేళ.. యూఎస్ సెక్రటరీ మార్కోతో జైశంకర్ భేటీ

ABN , Publish Date - Oct 28 , 2025 | 07:31 AM

మలేషియా రాజధాని కౌలాలంపుర్ లో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ కౌలాలంపుర్‌లో భేటీ అయ్యారు.

Jaishankar Meet US Secrtary: టారిఫ్ వివాదాల వేళ.. యూఎస్ సెక్రటరీ మార్కోతో జైశంకర్ భేటీ
Jaishankar Meet US Secrtary

కౌలాలంపుర్‌, అక్టోబర్ 28: ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య టారిఫ్ వివాదం కొనసాగుతోంది. దీనికి కారణం రష్యా నుండి ఇండియా చమురు కొనుగోలు చేయడం. ఈ నేపథ్యంలో మలేషియా రాజధాని కౌలాలంపుర్ లో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ, వాణిజ్య అంశాలపై వారిద్దరూ చర్చించారు.


ఢిల్లీ-వాషింగ్టన్‌ మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై వీరిద్దరూ(Jaishankar, Marco Rubio) తాజాగా చర్చించినట్లు తెలుస్తోంది. రెండు నెలల వ్యవధిలో వీరు కలవడం ఇది రెండోసారి. గత నెలలో UNGA సందర్భంగా జై శంకర్, మార్కో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో కూడా ఇరుదేశాలకు సంబంధించి అనేక రంగాలలో పరస్పర సహకారం గురించి చర్చించారు. బహిరంగ ఇండో-పసిఫిక్(Indo Pacific) ప్రాంతాన్ని ప్రోత్సహించడానికి కలిసి పని చేయాలని అంశం వారి మధ్య చర్చచకు వచ్చింది. మరోవైపు రష్యాతో ఇంధన బంధాన్ని కొనసాగిస్తున్నందుకు భారత్‌పై అదనంగా ట్రంప్‌ 25% టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమావేశంలో ఈ 25% టారిఫ్ తొలగిస్తామన్న హామీని జైశంకర్‌తో రూబియో ఇచ్చిన సంకేతాలేవీ కనిపించలేదు.


ఆగ్నేయాసియా దేశాల సంఘం (ASEAN Summit)వార్షిక శిఖరాగ్ర సదస్సు మలేషియాలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కౌలాలంపుర్‌ వెళ్లిన జైశంకర్‌.. అక్కడ వివిధ దేశాధినేతలు, ఇతర మత్రులతో భేటీ అయ్యారు. మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం, ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మద్‌ హాజీ హసన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్, సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్, జపాన్‌ విదేశాంగ మంత్రి మొతేగీ తొషిమిత్సు, థాయిలాండ్‌ విదేశాంగ మంత్రి సిహాసక్‌లతో జై శంకర్ విడివిడిగా భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై(international relations) వారితో చర్చించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్‌ మధ్యే పోటీ

నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 28 , 2025 | 07:32 AM