BJP Jubilee Hills by-poll: జూబ్లీహిల్స్లో బీజేపీ నేడు యూపీ తరహా వినూత్న ప్రచారం
ABN , Publish Date - Oct 28 , 2025 | 06:55 AM
జూబ్లీహిల్స్లో బీజేపీ ఇవాళ యూపీ తరహా వినూత్న ప్రచారం నిర్వహించబోతోంది. ఈ ఒకే రోజు 52 ప్రాంతాల్లో ప్రచారం చేస్తారు. సాయంత్రం గం. 4 నుంచి, రాత్రి గం. 9 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. నియోజకవర్గాన్ని 78 శక్తి కేంద్రాలుగా విభజించుకొని..
హైదరాబాద్, అక్టోబర్ 28: జూబ్లీహిల్స్లో బీజేపీ ఇవాళ(మంగళవారం) యూపీ తరహా వినూత్న ప్రచారం నిర్వహించబోతోంది. ఇందుకోసం రంగంలోకి కీలక నేతలు దిగుతున్నారు. ఈ ఒకే రోజు 52 ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు. సాయంత్రం 4 నుంచి, రాత్రి 9 వరకు ఈ ప్రచార కార్యక్రమం ఉంటుంది. 78 శక్తి కేంద్రాలుగా విభజించుకుని ఇంటింటికీ బీజేపీ నినాదంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్క్ ప్రచారాన్ని తెలంగాణలోనూ చేపట్టి ప్రజలకు చేరువవ్వాలని బీజేపీ యోచిస్తోంది. యూపీ ఎన్నికల్లో ప్రచారం చేపట్టిన తరహాలో ఇక్కడ కూడా.. దూకుడుగా వెళ్లాలని తలపోస్తోంది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఒకేసారి 52 ప్రాంతాల్లో ప్రచారానికి ప్లాన్ చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి, రాత్రి 9 గంటల వరకు జరిగే విస్తృత ప్రచారంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లంతా పాల్గొనాలని పార్టీ ఆదేశించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ.. పోలింగ్ బూత్ డివిజన్లను 78 శక్తి కేంద్రాలుగా ప్రకటించుకుని ముందుకు సాగుతోంది. ఒక్కో శక్తి కేంద్రంలో 6 నుంచి 8 పోలింగ్ బూత్ లు, ఏ పోలింగ్ బూత్ లో ఎవరు ప్రచారంలో పాల్గొనాలనే అంశంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం జాబితా సిద్ధం కూడా చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్లో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ
Read Latest Telangana News and National News