Share News

Facebook: ఫేస్‌బుక్‌లో పరిచయం.. రూ.10.21 లక్షలకు టోకరా.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Oct 28 , 2025 | 06:51 AM

ఫేస్‌బుక్‌లో స్నేహం నటించి పెట్టుబడి పేరుతో రూ.10.21 లక్షలకు టోకరా వేసిందో మహిళ. సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం.. లంగర్‌హౌజ్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఓ మహిళ పరిచయమైంది. తన పేరు సాయిప్రీతి అని, తనది వైజాగ్‌ అని ఇటీవలే యూకే నుంచి వచ్చానని నమ్మబలికింది.

Facebook: ఫేస్‌బుక్‌లో పరిచయం.. రూ.10.21 లక్షలకు టోకరా.. ఏం జరిగిందంటే..

- సైబర్‌ కిలేడీ మోసం

హైదరాబాద్‌ సిటీ: ఫేస్‌బుక్‌(Facebook)లో స్నేహం నటించి పెట్టుబడి పేరుతో రూ.10.21 లక్షలకు టోకరా వేసిందో మహిళ. సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం.. లంగర్‌హౌజ్‌(Langerhouse)కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఓ మహిళ పరిచయమైంది. తన పేరు సాయిప్రీతి(Saipreethi) అని, తనది వైజాగ్‌ అని ఇటీవలే యూకే నుంచి వచ్చానని నమ్మబలికింది. పరిచయం పెరిగిన తర్వాత ఆన్‌లైన్‌ పెట్టుబడులు, వ్యాపారం గురించి చెప్పడం ప్రారంభించింది. స్వల్ప కాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించి చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టించింది.


city1.2.jpg

ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపించింది. దీంతో అతడు రూ.10.21లక్షలు పెట్టుబడి పెట్టాడు. అందుకు 14వేల యూఎస్‌ డాలర్లు (రూ.12.04 లక్షలు) లాభం వచ్చినట్లు వర్చువల్‌గా చూపించింది. వాటిని విత్‌డ్రా చేయకుండా ఆప్షన్‌ క్లోజ్‌ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆదాయం పన్నులు, ఇతర ట్యాక్స్‌లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇదేదో సైబర్‌ మోసం అని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


city1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్‌ మధ్యే పోటీ

నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 28 , 2025 | 06:52 AM