Share News

Hamas Viral Video: ఆస్పత్రి కింద సొరంగం.. ఇజ్రాయెల్ డిఫెన్స్ వీడియో వైరల్..

ABN , Publish Date - Jun 08 , 2025 | 10:00 AM

హమాస్ ఆస్పత్రి కింద భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అనేక గదులతో కూడిన ఈ సొరంగం ద్వారా హమాస్ ఉగ్రవాదులు అనేక దురాగతాలకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ సొరంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Hamas Viral Video: ఆస్పత్రి కింద సొరంగం.. ఇజ్రాయెల్ డిఫెన్స్ వీడియో వైరల్..

గాజా (Gaza) పరిధి ఖాన్ యూనిస్‌లోని ఓ ఆసుపత్రి కింద పెద్ద సొరంగాన్ని ఇజ్రాయెల్ (Israel) సైనికులు గుర్తించారు. యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ కింద ఉన్న ఈ సొరంగాన్ని (Tunnel) .. హమాస్ కార్యకర్తలకు కమాండ్ కంట్రోల్ కేంద్రంగా, ఇజ్రాయెల్ దళాలపై దాడులను సమన్వయం చేయడానికి వాడుకున్నట్లు చెబుతున్నారు. ఇజ్రాయెల్ సైనికులు ఈ సొరంగంలోకి వెళ్లి వీడియో తీశారు. లోపల అనేక గదులు కనిపించాయి. అలాగే అనేక కమాండ్ కంట్రోల్ రూములు, ఆయుధాలు, అదనపు నిఘా తదితర అనేక సామగ్రి ఈ సొరంగంలో కనిపించింది.


హమాస్ ఉగ్రవాద ప్రయోజనాల కోసం గాజాలోని ఆసుపత్రులపై దాడులకు తెగబడుతున్నారని ఐడీఎఫ్ తెలిపింది. 2023లో గాజాలోనే ఓ పెద్ద ఆస్పత్రి కింద హమాస్ సొరంగాన్ని కనుగొన్నట్లు చెప్పారు. అయితే ఆ సొరంగం ప్రస్తుతం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారు. ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మార్గదర్శకత్వంలో గోలాని బ్రిగేడ్, యాహలోమ్ యూనిట్, ప్రత్యేక దళాల ఆపరేషన్ సమయంలో ఈ తాజా సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ అకాడమీ శనివారం తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News

Updated Date - Jun 08 , 2025 | 10:14 AM