Khamenei on Israel: ఇజ్రాయెల్ అమెరికా పెంపుడు కుక్క: ఇరాన్ సుప్రీం లీడర్
ABN , Publish Date - Jul 16 , 2025 | 09:04 PM
ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరుదేశాల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ కణితితో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసి మరోసారి నిప్పు రాజేశారు.

Khamenei calls Israel cancerous: ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ ఇరుదేశాల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. బుధవారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఇజ్రాయెల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ కణితి లాంటిదని దానిని దాని మూలాల నుండి నిర్మూలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే ఇజ్రాయెల్ అమెరికా పెంపుడు కుక్క లాగా ఆ దేశం చెప్పినట్టల్లా ఆడుతోందని విరుచుకుపడ్డారు. దాని సూచనల ప్రకారమే నడుచుకుంటోందని ఆరోపించారు.
అమెరికా, ఇజ్రాయెల్ దోస్తీపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరోసారి ధ్వజమెత్తారు. తన దేశంలో అస్థిరతను వ్యాప్తి చేయడమే ఇజ్రాయెల్ లక్ష్యమని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ సాకుగా అగ్రరాజ్యంపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్‌ను నమ్మలేమని అనుమానం వ్యక్తం చేశారు. ఎప్పుడైనా తమ దేశంపై దాడి చేయవచ్చని.. ఒకవేళ చేస్తే మాత్రం తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. గతనెల ఇజ్రాయెల్ ఇరాన్ పై జరిపిన దాడికి బలంగా బదులిచ్చిందని చెప్పుకొచ్చారు.
అమెరికా, దాని పెంపుడు జంతువు ఇజ్రాయెల్‌తో పోరాడినా తమకే హాని కలగదని.. వెనకడుగు వేయమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమెరికాతో అణు చర్చలకు ముందు ఖమేనీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. గతనెల ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. ఇరాన్‌లోని అనేక మంది అణు శాస్త్రవేత్తలను, వందలాది ప్రజలను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. సుమారు 1060 మంది ప్రాణాలను కోల్పోయారు.
ఇవి కూడా చదవండి..
లైవ్‌లో ఉండగానే యాంకర్ పరుగో పరుగు
ప్రణాళిక ప్రకారమే పహల్గాం ఉగ్రదాడి.. షాంఘై సమావేశంలో జైశంకర్
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి