Share News

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మరో భారీ భూకంపం.. భారత్‌పైనా ఎఫెక్ట్..

ABN , Publish Date - Apr 19 , 2025 | 01:50 PM

మయన్మార్, థాయ్‌లాండ్‌ భూకంపం ఏ స్థాయిలో నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషాద ఘటన మర్చిపోక ముందే ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 12:17 గంటల సమయంలో భూకంపం సంభవించింది.

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మరో భారీ భూకంపం.. భారత్‌పైనా ఎఫెక్ట్..

మయన్మార్, థాయ్‌లాండ్‌ భూకంపం ఏ స్థాయిలో నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషాద ఘటన మర్చిపోక ముందే ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 12:17 గంటల సమయంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 5.8గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్ ఫర్‌ సిస్మోలజీ (National Center for Seismology) పేర్కొంది. భూ ప్రకంపనలతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా పరుగులు తీశారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.


అఫ్ఘానిస్థాన్‌ – తజికిస్థాన్‌ (Afghanistan – Tajikistan) సరిహద్దుల్లో 130 కిలోమీటర్ల లోతులో భూకంపం (Earthquake) సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ స్థాయిలో భూమి కంపించడం మూడు రోజుల్లో ఇది రెండోసారి అని తెలిసింది. సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ భూకంపం ఎఫెక్ట్ పాకిస్తాన్‌పై కూడా పడింది. అలాగే ఇటు భారత్‌లోని జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తేలికపాటి భూప్రకంపనలు సంభవించినట్లు తెలిసింది. ఉపరితలం నుంచి 130 కిలోమీటర్ల లోతులో టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో పెను కదలికలు చోటు చేసుకోవడంతో ఇలా జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు పేర్కొన్నారు. రాజధాని కాబుల్‌కు ఈశాన్య దిశగా ఉన్న బదాక్షన్ ప్రావిన్స్ పరిధిలోని మాఘ్ నువుల్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. కాగా, భూకంపానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Updated Date - Apr 19 , 2025 | 09:21 PM