Home » Afghanistan
విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్ గుట్టురట్టయింది. ఇది కేవలం స్థానిక అంశం మాత్రమే కాక, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు.
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సినన పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సందిగ్ధంలో పడింది.
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై అఫ్గాన్ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాక్ మిలిటరీ స్థావరాలపై డ్రోన్ దాడులు చేశామని తాలిబాన్లు ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌లో పాక్ ఇటీవల జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేశామని పేర్కొన్నారు.
కొద్ది రోజులుగా అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో భీకర దాడులు కొనసాగుతున్నాయి. పాక్‌లోని కీలక సైనిక స్థావరాలపై అఫ్గానిస్థాన్ సైన్యం డ్రోన్‌లతో దాడి చేసింది.
అఫ్గాన్-పాక్ ఘర్షణల అంశంలో తాను జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేనట్టు కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. పాక్ ప్రధాని, ఆర్మీ జనరల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
అఫ్గానిస్థాన్‌పై పాక్ యుద్ధం ప్రకటించింది. తమ సహనం నశించిందని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఎక్స్ వేదికగా స్పందించారు. కాబుల్, కాందహార్ సహా పలు ప్రాంతాల్లోని అఫ్గాన్ మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా శుక్రవారం పాక్ వైమానిక దాడులకు దిగింది.
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. కొంతకాలంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణానికి దారితీశాయి. పాక్ వైమానిక దళం అఫ్గాన్ భూభాగంలో కీలక సైనిక లక్ష్యాలపై విరుచుకుపడింది. వివరాల్లోకి వెళితే..
పాక్ వైమానిక దాడులపై అఫ్గానిస్థాన్ మండిపడింది. తగిన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పొరుగు విషయంలో సఖ్యతతో ఉండాలన్న కనీస ఇస్లామిక్ విలువను కూడా పాక్ మర్చిపోయిందని మండిపడింది.
అఫ్గానిస్థాన్‌లో తాజాగా పాక్ వైమానిక దాడులు చేసింది. సరిహద్దుకు సమీపంలోని ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించింది. ఉగ్రమూకలే టార్గెట్‌గా ఈ దాడులు చేశామని పాక్ సమాచార శాఖా మంత్రి తెలిపారు.