Share News

High Blood Sugar Foods: ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.. జాగ్రత్త..

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:40 PM

Foods That Spike Blood Sugar: మీరు తినే ఆహారం మీ రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే తినే ముందు జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెరను పెంచే ఈ కింది ఆహారాలను కచ్చితంగా నివారించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

High Blood Sugar Foods: ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.. జాగ్రత్త..
High Blood Sugar Foods

రక్తంలో అధిక మోతాదులో చక్కెర స్థాయిలు పెంచే ఆహారాలు తినడం ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. శరీరంలో గ్లూకోజ్ పెరిగిందనేందుకు ఇది సంకేతం. డయాబెటిస్ ఉన్నవారు ఇంకా జాగ్రత్తంగా ఉండాలి. వీరి శరీరం అవసరమైన ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు లేదా శరీరం ఉత్పత్తి చేసిన ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేదు. ఎందుకంటే సాధారణంగానే వారి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అది మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, రెటినోపతి, న్యూరోపతి వంటి వాటికి దారితీస్తుంది.


మీ రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే ప్రధాన అంశం మీరు తీసుకునే ఆహారం. మీ రక్తంలో చక్కెరను పెంచే ఆహారాన్ని మీరు తినకూడదు. అయితే, కొన్నిసార్లు తెలియకుండానే ఈ ఆహారాలను తినేస్తుంటారు. అవేంటో చూద్దాం.

గ్రానోలా బార్లు

వీటిని ఆరోగ్యకరమైన ఆహారాలుగా మార్కెటింగ్ చేస్తుంటాయి ఉత్పత్తిచేసే కంపెనీలు. కానీ, గ్రానోలా బార్‌లలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, సిరప్‌లు, ఎండిన పండ్లు ఉంటాయి. ఈ పదార్థాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అధికం. ఇవి మీ రక్తంలో చక్కెరను త్వరగా పెంచేస్తాయి.

పెరుగు

సాదా పెరుగు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ ఫ్లేవర్డ్ రకాల్లో సాధారణంగా చక్కెరలు జోడిస్తారు. కొన్నిసార్లు ప్రతి సర్వింగ్‌కు 20 గ్రాముల వరకే తీసుకోవాలి. ఈ హిడ్డెన్ షుగర్స్ మీ రక్తంలో గ్లూకోజ్‌ను వేగంగా పెంచుతాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు.

పండ్ల రసాలు

సహజ పండ్ల రసంలో 100% ఫైబర్ ఉండదు. కానీ అన్ని పండ్లరసాల్లో ఇది కనిపిస్తుంది. అందువల్ల బ్లడ్ షుగర్స్ శరీరంలో అమాంతం పెరిగిపోతాయి. ఉదాహరణకు నారింజ రసం తాగిన వెంటనే రక్తంలో చక్కెర వేగంగా పెరిగిపోతుంది.


చపాతీ

మైదా పిండితో చేసిన రోటీ కంటే మంచిదే అయినప్పటికీ హోల్ వీట్ బ్రెడ్ బ్రాండ్ ప్రాసెసింగ్‌ను బట్టి అధిక గ్లైసెమిక్ లోడ్‌ను కలిగి ఉంటుంది. కొన్ని హోల్ వీట్ బ్రెడ్‌లలో చక్కెరలు కూడా ఉంటాయి లేదా ఇతర రకాల పిండితో తయారు చేస్తారు. ఇవి గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి.

ఓట్ మీల్స్

ఓట్స్ ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఇన్‌స్టంట్ ఓట్ మీల్ బాగా ప్రాసెస్ చేస్తారు. ఇందులో చక్కెర, ఉప్పు, ఇతర టేస్టీ ఇంగ్రిడియెంట్స్ ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉండటం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. కానీ, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

డ్రై ఫ్రూట్స్

ఎండుద్రాక్ష, ఖర్జూరం లేదా ఆప్రికాట్ వంటి ఎండిన పండ్లు సహజ చక్కెర వనరులు. తాజా పండ్లలో నీటి శాతం ఉండదు. కానీ వీటిలో అధికం.

కాఫీ (యాడ్-ఆన్‌లతో)

కాఫీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకపోయినా ఫ్లేవర్డ్ లాట్స్, ఐస్డ్ కాఫీలు, ఫ్రాప్స్ లలో సిరప్ లు, విప్డ్ క్రీమ్, చక్కెర పాలు ఉండవచ్చు. ఈ అదనపు పదార్థాలు మీ కాఫీని చక్కెరలతో నింపేస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


ఇవి కూడా చదవండి:

మీరేంటో మీ పొట్ట చెప్పేస్తుంది..

గ్రీన్ టీ తాగుతున్నారా? సరైన సమయం ఏదో తెలుసుకోండి.

Read Latest and Health News

Updated Date - Jul 06 , 2025 | 04:07 PM