Diabetes: డయాబెటిస్‌కు చికిత్స ఆలస్యమైతే ఏమవుతుంది.. ఒకసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే ఆపేయవచ్చా..
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:21 PM
Diabetes Insulin Dependency:కొంతమంది డయాబెటిస్ లక్షణాలను గుర్తించలేకపోవడం వల్ల చికిత్స ఆలస్యమవుతుంది. ఇలా జరిగితే వచ్చే ఏఏ సమస్యలు వస్తాయి. దీన్ని తగ్గించుకునేందుకు ఒకసారి ఇన్సులిన్ వేసుకోవడం మొదలుపెడితే జీవితాంతం వేసుకుంటూ ఉండాలా లేకపోతే మధ్యలోనే ఆపేయడం మంచిదా..

Can You Stop Insulin Once You Start: డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరిగిపోతున్నారు. కొంతమందిలో ఈ వ్యాధి లక్షణాలు ముందస్తుగా కనిపిస్తే.. మరికొంతమందిలో చాలాకాలానికి గానీ కనిపించవు. ఇక ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు అనుసరిస్తున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఏ వయసు వారికైనా షుగర్ వచ్చే అవకాశం పెరుగుతోంది. తీపి ఎక్కువగా తినడం వల్లే కాక అనేక ఇతర కారణాల వల్ల రక్తంలో చక్కెరస్థాయి అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజల మనస్సులలో వివిధ ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి.
డయాబెటిస్‌కు చికిత్స చేయకపోతే కాలక్రమేణా ఈ కింది సమస్యలను కలిగిస్తుంది.
1) అధిక రక్త చక్కెర
మధుమేహానికి చికిత్స పొందడం ఆలస్యం అయితే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన శరీరంలోని అవయవాలు, కణజాలాలు దెబ్బతింటాయి.
2) గుండె సమస్యలు
అధిక రక్తంలో చక్కెర స్థాయిలు గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.
3) మూత్రపిండాలు
మధుమేహానికి సరిగ్గా చికిత్స చేయకపోతే అది కిడ్నీల పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. చివరికి పనిచేయని స్థితి వచ్చేలా చేస్తుంది.
4) కళ్లు
డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కంటి చూపు దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా అంధులు కూడా అయ్యే ఛాన్స్ ఉంది.
5) నరాలు
శరీరంలో పెరిగిన షుగర్ నరాల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. తిమ్మిరి, జలదరింపు, విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది.
ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే మళ్లీ మళ్లీ వేసుకోవాలా?
టైప్ 1 డయాబెటిస్ ఉంటే శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేని ఆటో ఇమ్యూన్ పరిస్థితి తలెత్తుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి జీవితాంతం ఇన్సులిన్ అవసరం .
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు మందులు, ఆహారం లేదా వ్యాయామం ద్వారా కూడా రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే డాక్టర్ సలహాతో ఇన్సులిన్ తీసుకోవాలి.
గర్భధారణ సమయంలో మహిళలు తాత్కాలికంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకోవచ్చు.
Read Also: Gym Tips: చెమట చిందించే ముందు...'
Diabetes: రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఇవి షుగర్‌కు సంకేతం కావచ్చు..
Hot Water Side Effects: మీకు ఈ సమస్యలు ఉంటే వేడి నీళ్లు తాగడం మంచిది కాదు..