Eating Mango: వేసవిలో మామిడి పండ్లను ఈ టైంలో తినకూడదు.. ఎందుకంటే..
ABN , Publish Date - Apr 25 , 2025 | 02:31 PM
Best Time To Eat Mango: మామిడి పండ్ల రుచి తలచుకోగానే ఎవరికైనా నోరూరాల్సిందే. ఎండాకాలంలోనే లభించే మామిడిని రోజూ తినాలనే కోరికతో ఇంట్లో నిల్వ చేసుకునేవారు ఎక్కువే. కానీ, రోజులో ఈ సమయాల్లో మాత్రం ఎప్పుడూ మామిడి పండు తినే సాహసం చేయకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Mango Consumption Tips: వేసవిలో మార్కెట్లు మామిడి, పుచ్చకాయ, నేరేడు వంటి పండ్లతో కళకళలాడుతూ ఉంటాయి. ఈ పండ్లలో అందరూ ఇష్టంగా తినే పండు ఏదైనా ఉంటే అది కేవలం మామిడి మాత్రమే. పండ్లలో రారాజుగా పేరొందిన మామిడి రుచి అన్ని వయసుల వారికి నచ్చుతుంది. కొంతమంది మ్యాంగో జ్యూస్ బాగా ఇష్టపడితే, మరికొంతమంది ఐస్ క్రీం ఫ్లేవర్లో వేసుకుని ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ, మీరు ఎంతో ఇష్టపడే మామిడిని రోజులో కొన్ని సమయాల్లో మాత్రమే తినాలి. తప్పుడు సమయాల్లో తిన్నారంటే గనక అనేక సమస్యలు వస్తాయి. ఇది మాత్రమే కాదు. మామిడి పండు తినేముందు ఈ చిన్న విషయాలను తప్పక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
మామిడి తినడానికి సరైన మార్గం
మామిడి పండు తినే ముందు మీరు ఒక పని చేయాలి. మార్కెట్ నుండి తెచ్చిన మామిడి పండ్లను రిఫ్రిజిరేటర్ నుంచి ఉంచే అలవాటు ఉంటే గనక ఇలా చేయండి. ఫ్రిజ్ నుంచి తీసిన తర్వాత నేరుగా తినడం మానేయండి. తినడానికి ముందు 2 గంటల పాటు మంచినీటిలో నానబెట్టండి. మళ్ళీ శుభ్రమైన నీటితో కడిగాకే తినాలి. ఎందుకంటే ఈ పద్ధతి పాటిస్తే మామిడిలో ఉండే థర్మోజెనిక్ లక్షణాలు తగ్గిపోతాయి. కెమికల్స్, తదితర అనర్థాలు, దుష్ప్రభావాలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
ఈ సమయంలో తినకండి
రాత్రిపూట ఏ పండ్లను తినకూడదని దాదాపు అందరికీ తెలుసు. ఈ పండ్లలో ఉండే పోషకాలు ఉదయం లేదా సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు తిన్నప్పుడు మాత్రమే శరీరంపై ప్రభావం చూపుతాయి. అందుకే సాయంత్రం 5 గంటల తర్వాత మామిడి పండ్లు తినకూడదు. అయితే, ఉదయం అల్పాహారంలో మామిడిపండు ఎప్పుడూ చేయకూడదు. పోహా లేదా గంజి తీసుకుంటూ ఉంటే మామిడి తినవచ్చు. ఖాళీ కడుపుతో మాత్రం మామిడి తినవద్దు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
ఇదే సరైన సమయం
ప్రజలు తరచుగా భోజనం తర్వాత మామిడిపండ్లు తినడానికి ఇష్టపడతారు. దీనిని రోజువారీ భోజనంతో పాటు తినకూడదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య మామిడి పండ్లు తినడానికి ఉత్తమ సమయం. ఈ సమయంలో మామిడి తినడం వల్ల ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు.
Read Also: Fake vs Real ORS: నకిలీ ORS తో ఆరోగ్యానికి పెద్ద ముప్పు.. అసలైనది
Coffee: రోజూ మూడు కప్పుల కాఫీ మంచిదే..
Constipation: ఈ కూరగాయలంటే మీకిష్టమా.. జాగ్రత్త.. ఇవి తింటే మలబద్ధకం..