Share News

Neem Leaves: డయాబెటిస్ బాధితులు వేప ఆకులు నమలవచ్చా..

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:52 PM

Neem Leaves For Health: ఆయుర్వేదం ప్రకారం వేప చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యానికి దివ్యౌషధం. ఇక వేప ఆకులు నమిలితే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ, వేప చేదు డయాబెటిస్ రోగుల రక్తంలో షుగర్ స్థాయిలు పెంచుతుందా.. తగ్గిస్తుందా..

Neem Leaves: డయాబెటిస్ బాధితులు వేప ఆకులు నమలవచ్చా..
Neem Leaves Side Effects On Health

Side Effects Of Eating Neem Leaves: వేప ఆకులను నమలడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను మీరు వినే ఉంటారు. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వేప ఆకులను నమిలితే జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరాన్ని డీటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. అలాగే వేప ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఒక వ్యక్తి త్వరగా అనారోగ్యానికి గురికాకుండా నిరోధిస్తుంది. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే వేపాకు వీరికి మాత్రం హానినే కలిగిస్తుంది.ఈ 7 రకాల వ్యక్తులు పొరపాటున కూడా వేప ఆకులను నమలకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


గర్భిణీ స్త్రీలు

వేపాకులు గర్భాశయాన్ని ప్రభావితం చేయడం ద్వారా గర్భస్రావ ప్రమాదాన్ని పెంచుతాయి . కాబట్టి, గర్భిణీ స్త్రీలు వేప తీసుకునే ముందు తప్పక డాక్టరును సంప్రదించాలి.


ఆటో ఇమ్యూన్ వ్యాధి

మీకు ఏదైనా ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉంటే వేప ఆకులను తినకుండా ఉండటం మంచిది. నిజానికి వేప రోగనిరోధక వ్యవస్థను మరింత చురుగ్గా చేస్తుంది. దీని కారణంగా కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ వ్యాధుల లక్షణాలు కూడా వేగంగా బయటపడటం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి రోగికి మంచిది కాదు.


చిన్న పిల్లలు

చిన్న పిల్లల జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వేప ఆకులు తినడం వారికి హానికరం. ఒకవేళ వీటిని తింటే పిల్లల్లో వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇది కాకుండా వేప ఆకులలో ఉండే కొన్ని పదార్థాలు పిల్లల్లో అలెర్జీలకు కారణమవుతాయి.


డయాబెటిస్ రోగులు

వేప తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా తగ్గుతుంది. అందుకే డయాబెటిస్ మందులు తీసుకునే వ్యక్తులు లేదా హైపోగ్లైసీమియాతో బాధపడుతున్న రోగులు వేపను జాగ్రత్తగా తీసుకోవాలి.


కాలేయం లేదా కిడ్నీ వ్యాధి

వేపాకులను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ వ్యాధులతో బాధపడేవారు వేపను తినకూడదు.


అలెర్జీలు

కొంతమందికి వేప ఆకులు తింటే అలెర్జీ వస్తుంది. అది తెలియక నమిలితే చర్మంపై దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. మీకు వేప అలెర్జీ ఉంటే వేపను తినకండి.


శస్త్రచికిత్సకు ముందు

వేప రక్తంలో చక్కెర, రక్తపోటును ప్రభావితం చేయవచ్చు. కాబట్టి, ఒక వ్యక్తి ఏదైనా శస్త్రచికిత్స చేయించుకోవలసి వస్తే కనీసం 2 వారాల ముందుగానే దానిని తీసుకోవడం మానేయాలి.


ఈ జాగ్రత్తలు తీసుకోండి

  • మీరు ఏదైనా ఔషధం తీసుకుంటుంటే వేప ఆకులు నమలడానికి ముందు వైద్యుడిని సంప్రదించండి.

  • వేపను అధిక పరిమాణంలో తినవద్దు. అలా చేయడం వల్ల వికారం, వాంతులు లేదా తలతిరుగుతున్నట్లు అనిపించవచ్చు.

  • ఎల్లప్పుడూ తాజా, శుభ్రమైన వేప ఆకులనే వాడండి.


Read Also: Jamun Benefits: నేరేడు పండ్ల విత్తనాలు పారేస్తున్నారా.. ఇలా వాడితే ఆ సమస్యలు పోతాయ్....

ఆ ఒక్క విటమిన్ లోపం.. మీ వైవాహిక జీవితం నాశనం..

Vitamin B12 Foods: విటమిన్ బి 12 తక్కువగా

Updated Date - Apr 17 , 2025 | 04:53 PM