Fruit Combination: పండ్లను వీటితో కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలు..
ABN , Publish Date - May 11 , 2025 | 06:38 PM
Fruit Combination For Health Benefits: పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. ఒక్కో పండుకి ఒక్కో ప్రత్యేకమైన రుచి, ప్రయోజనాలు ఉంటాయి. కానీ, మీరు ఇలా తిన్నారంటే మాత్రం పండ్ల వల్ల ఆరోగ్యానికి రెట్టింపు మేలు జరుగుతుంది. అదెలాగో చూద్దాం.

Fruit And Spice Combinations: పండ్లు ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమైనా ఎలా తినాలి? ఏ సమయంలో తింటే మంచిది? వేటితో కలిపి తినకూడదు? వేటితో కలిపి తినాలి? అనే ప్రశ్నలకు ఆయుర్వేదంలో కచ్చితమైన సమాధానాలు ఉన్నాయి. పండ్ల ఎంత పోషకాహాలకు నిలయమైనా వాటిని సరైన పద్ధతిలో తినకపోతే ఆరోగ్యపరంగా ఎలాంటి లాభం ఉండకపోగా హాని కలిగే ప్రమాదమూ లేకపోలేదు. తెలిసీ తెలియక ఎలా పడితే అలా పండ్లను ఆరగిస్తే అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు పెరుగుతాయి. అయితే, పండ్లను ఎప్పుడూ ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత తినకూడదని గుర్తుంచుకోండి. అదే గాక, పండ్ల వల్ల రెట్టింపు ప్రయోజనాలు దక్కాలంటే ఇలా చేసి చూడండి. మీకే తెలుస్తుంది.
అరటి
అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే, చాలా మందికి అరటిపండు తిన్న తర్వాత మలబద్ధకం అనిపిస్తుంది. అటువంటి పరిస్థితి మీకూ ఎదురైతే అరటిపండును కొన్ని ఏలకులు గింజలతో కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల అరటిపండు తిన్నాక ఏ ఇబ్బంది కలగదు. పైగా రెట్టింపు ప్రయోనాలూ దక్కుతాయి.
మామిడి
పండ్లలో రారాజు మామిడిని వేసవిలో ప్రతిరోజూ తినేవారుంటారు. కానీ ఈ పండును తినే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే, రుచిగా ఉన్నాయని వీటిని ఎక్కువగా తింటే కడుపులో గ్యాస్ వస్తుంది. అలాగే మ్యాంగో తిన్న వెంటనే కడుపులో ఉబ్బరంగా అనిపిస్తే చిటికెడు ఎండు అల్లం పొడిని జోడించండి. ఇలా చేయడం వల్ల శరీరంలో పెరిగిన వేడి తగ్గి మామిడి సులభంగా జీర్ణమవుతుంది.
పుచ్చకాయ
పుచ్చకాయను చాలా మంది నల్లఉప్పు లేదా ఛాట్ మసాలాతో కలిపి తినడం చూసే ఉంటారు. నిజానికి, ఇలా సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన చిటికెడు పొడి రుచిని పుచ్చకాయతో కలిపి తింటే శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ కొరత తీరుతుంది. ఎందుకంటే అందులో సోడియం పరిమాణం పెరుగుతుంది.
దోసకాయ
దోసకాయను ఎప్పుడూ సాదాగా తినకూడదని పోషకాహార నిపుణులు అంటున్నారు. దానిపై కొద్దిగా చాట్ మసాలా చల్లుకుని తినడం వల్ల అది శరీరంలో సులభంగా కలిసిపోతుంది. వాతాన్ని కూడా సమతుల్యం చేస్తుంది.
పైనాపిల్, నారింజ, నిమ్మకాయ
పైనాపిల్, నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లలో సి- విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి వేసవిలో శరీరానికి మరింత ఉత్సాహాన్ని అందిస్తాయి. ఈ పండ్లను పుదీనాతో కలిపి తింటే రుచి పెరగడమే కాకుండా ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.
Read Also: 10-3-2-1 సుఖనిద్రకు ఫార్ములా...
పిల్లల డైట్ ప్లాన్ ఎలా ఉండాలంటే...