Share News

Pre-Diabetes: ప్రీ-డయాబెటిస్‌ నయం చేసేందుకు 10 మార్గాలు..

ABN , Publish Date - Jun 22 , 2025 | 09:49 AM

Pre-Diabetes Controlling Tips: నేటికాలంలో చిన్నవయసులోనే మధుమేహం బారిన పడేవారి సంఖ్య అధికమవుతోంది. ఇది బయటపడకముందే అంటే ప్రీ-డయాబెటిస్ స్టేజీలోనే కొన్ని టిప్స్ పాటించారంటే ఈ దీర్ఘకాలిక వ్యాధిగా పూర్తిగా నయంచేసుకోవచ్చని డైటీషియన్లు సూచిస్తున్నారు.

Pre-Diabetes: ప్రీ-డయాబెటిస్‌ నయం చేసేందుకు 10 మార్గాలు..
Reverse Pre Diabetes Reducing Tips

How to Cure Prediabetes Naturally: భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందనేందుకు శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరగడమే సంకేతం. ప్రీ- డయాబెటిస్ దశలో రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణం కంటే అధికంగా ఉంటుంది. కానీ, చక్కెర వ్యాధి నిర్దారణ అయ్యాక ఉన్నంత ఎక్కువగా ఉండదు. ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారం, కుటుంబ చరిత్ర, వయస్సు వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య వస్తుందని తెలిసిందే. డయాబెటిస్ ఒకసారి సోకితే జీవితాంతం పోదని తెలుసు. కానీ, మంచి విషయం ఏంటంటే.. ప్రీ-డయాబెటిస్ లక్షణాలు మీలో ఉంటే దానిని పూర్తిగా నయం చేసేందుకు ఛాన్స్ ఉంది. ఈ కింది 10 సూత్రాలు పాటించడం ద్వారా మీరు చక్కెర వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు.


ప్రీ-డయాబెటిస్‌ను నయం చేసేందుకు10 మార్గాలు

1) కార్బోహైడ్రేట్లను తగ్గించే బదులు ఆహార పదార్థాల గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్‌పై దృష్టి పెట్టడం ప్రారంభించండి. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించి నెమ్మదిగా గ్లూకోజ్‌ను విడుదల చేసే ఆహార పదార్థాలను మాత్రమే ఎంచుకోండి.

2) సూక్ష్మ ఖనిజ లోపం ఉందేమో తనిఖీ చేసుకోండి. ముఖ్యంగా మెగ్నీషియం, జింక్, క్రోమియం మొదలైనవి. ప్రీ-డయాబెటిస్ మూల కారణాన్ని అర్థం చేసుకోవడానికి ఇన్సులిన్ ఫాస్టింగ్, HOMA-IR పరీక్షలు చేయించుకోండి.

3) రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే కార్టిసాల్ హార్మోన్ నియంత్రించాలంటే రోజూ 7-9 గంటలు తప్పకుండా నిద్రపోవాలి.

4) ప్రీ-డయాబెటిస్‌ను తిప్పికొట్టడానికి అల్పాహారం అతి ముఖ్యమైన భోజనాలలో ఒకటి. అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టండి.

5) అసిడిటీని అదుపులో ఉంచుకుంటూ యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడే హోం టిప్స్ ప్రయత్నించండి.


6) వారానికి కనీసం 150 నిమిషాలు కచ్చితంగా వ్యాయామం చేయడం. చురుకైన నడక, సైక్లింగ్ లేదా ఈత కొట్టడం వంటివి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వండి.

7) అదనపు కొవ్వును నివారించేందుకు ప్రయత్నించండి. అలాగే ధూమపానాన్ని నివారించండి. దీనివల్ల, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

8) గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.

9) ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది కాబట్టి, దానిని నిర్వహించడానికి ఆరోగ్యకరమైన మార్గాలు అనుసరించండి.

10) ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. వీటి వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభించడంతో పాటు కడుపు నిండిన భావన కలిగి బరువు నియంత్రణలో ఉంటుంది. రోజులో 5-6 సార్లు తక్కువ మోతాదులో ఏదొక ఆహారం తీసుకుంటూ ఉండటం అలవాటు చేసుకోండి.


Also Read:

వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదా.. బీ అలర్ట్..

సన్నబడాలనే ఆశతో వెయిట్ లాస్ పిల్స్ వేసుకుంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి..!For More Health News

Updated Date - Jun 22 , 2025 | 10:14 AM