Diabetes: రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఇవి షుగర్‌కు సంకేతం కావచ్చు..
ABN , Publish Date - Apr 27 , 2025 | 09:19 AM
Diabetes Symptoms At Night: నేటి కాలంలో చిన్నవయసులోనే మధుమేహం బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఒకసారి ఈ వ్యాధి వస్తే నయమయ్యే దారి లేదని తెలిసిందే. కాబట్టి, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఈ 5 లక్షణాలు మీలో కనిపిస్తుంటే వెంటనే జాగ్రత్త పడండి.

Warning Signs of Diabetes at Night: ఈ రోజుల్లో డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. స్వీట్లు తినడం వల్ల డయాబెటిస్ వస్తుందని ఒక సాధారణ అపోహ ప్రజల్లో ఉంది. అయితే శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి, పనితీరు వల్లే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక డయాబెటిస్‌లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ సమస్య వచ్చేముందు, వచ్చిన తర్వాత శరీరంలో వివిధ రకాల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట నిద్రపోయే సమయంలో ఈ 5 లక్షణాలు షుగర్ రాకకు సంకేతం. కాబట్టి, వీటి విషయంలో వెంటనే జాగ్రత్త పడండి.
రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ 5 లక్షణాలు మీకు అనిపిస్తే అప్రమత్తంగా ఉండండి. ఇవి డయాబెటిస్ వస్తుందని హెచ్చరించే సంకేతాలు కావచ్చు.
1) చెమటలు పట్టడం
రాత్రిపూట చెమటలు పట్టడానికి కారణం రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండటం. అయితే, రాత్రి చెమటలతో పాటు ఏవైనా ఇతర లక్షణాలను మీరు గమనించినట్లయితే డయాబెటిస్ ఉందేమో టెస్ట్ చేయించుకోండి.
2) తరచుగా మూత్రవిసర్జన
ముఖ్యంగా రాత్రి సమయంలో సాధారణం కంటే ఎక్కువగా బాత్రూమ్‌కు వెళ్లడం అధిక రక్తంలో చక్కెరకు సంకేతం. డయాబెటిస్ వల్లే రక్తం నుంచి అదనపు చక్కెరను తొలగించడానికి మీ మూత్రపిండాలు కష్టపడి పనిచేస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు మూత్రంలో ఎక్కువ చక్కెరను వెళ్లిపోతుంది. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జన వెళ్లాల్సి వస్తుంది.
3) అధిక దాహం
తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై తరచుగా దాహం వేస్తుంది. కానీ ఎక్కువ నీరు త్రాగడం వల్ల దాహం తీరదు. గ్లూకోజ్ స్థాయిలు అదుపులో లేని వ్యక్తుల్లో ఇతరుల కంటే తక్కువ లాలాజలం ఉత్పత్తి కావడం వల్లే ఈ పరిస్థితి వస్తుంది.
4) తిమ్మిరి
రక్త ప్రసరణ సరిగా లేకపోతే నరాల దెబ్బతినడం వల్ల చేతులు, కాళ్ళలో జలదరింపు వచ్చి తిమ్మిరి లేదా నొప్పి వస్తుంది.
5) రాత్రి భోజనం తర్వాత ఆకలి
డయాబెటిస్ ఉన్న వారికి కడుపు నిండుగా తిన్నతర్వాత కూడా మళ్లీ ఏదైనా తినాలనే కోరిక కలుగుతుంది. దీనిని డయాబెటిక్ హైపర్‌ఫేజియా లేదా పాలీఫేజియా అని కూడా అంటారు. షుగర్ ఉన్నవారు ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఎందుకంటే ఇన్సులిన్ అసమతుల్యత చక్కెరను శక్తిగా మార్చడాన్ని అడ్డుకుంటుంది.
Read Also: Hot Water Side Effects: మీకు ఈ సమస్యలు ఉంటే వేడి నీళ్లు తాగడం మంచిది కాదు..
Sugarcane Juice: చెరకు రసం ఎంతకాలం నిల్వ ఉంటుందో తెలుసా..
Watermelon:పుచ్చకాయను భోజనానికి ముందు తినాలా.. తర్వాత తినాలా..