Summer: వడదెబ్బకు.. జాగ్రత్తలే మందు
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:13 AM
ప్రస్తుతం వేసవి సీజన్ ఆరంభమైంది. ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటుతోంది. ప్రతిఒక్కరూ ఏదో ఒకపనిమీద బయటకు వెళ్లక తప్పదు. ఈ క్రమంలో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. అయితే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వడదెబ్బ తగలకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ జాగ్రతలేంటో ఇప్పుడు తెలుపుకుందాం.

- నగరంలో ప్రస్తుతం 41 డిగ్రీల ఉష్ణోగ్రత
- ప్రజలు టోపీలు, హెల్మెట్లు ధరించడం అవసరం
- బీపీ, షుగర్ పేషంట్లు వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం
- జ్వరం 105 డిగ్రీలుగా నమోదవుతున్న దుస్థితి
- డీ హైడ్రేషన్ కాకుండా జాగ్రత్తలూ ముఖ్యమే
- జ్యూస్‌లు కాకుండా నీరు తాగితే శ్రేయస్కరం
హైదరాబాద్ సిటీ: బయట ఎండ మండిపోతోంది. ఇటీవల రెండు, మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల వరకు నమోదవుతోంది. దీంతో ఉదయం పది గంటలకే సూరీడు సెగలు పుట్టిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం, సాయంత్రం టెంపరేచర్‌తో వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. దాని నుంచి బయటపడాలంటే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. బీపీ, షుగర్ పెషంట్లు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు. బయటికి వెళ్లేవారు టోపీలు తదితర రక్షణ వస్తువులు వాడాలని పేర్కొంటున్నారు. ఆమేరకు కథనం.
ఈ వార్తను కూడా చదవండి: Liquor : ఆహా.. ఏం ఐడియా గురూ.. ఖరీదైన బాటిళ్లలో కల్తీ మద్యం
వడదెబ్బ లక్షణాలు ఎండలో తిరగడం వల్ల శరీరంలో సమతుల్యత లోపిస్తుంది. శరీరం నుంచి మెదడకు వ్యవస్థ కణజాలానికి అవసరమైన ఎనర్జీ తగ్గుతుంది. ఎండలో తిరిగిన వారి శరీరం నియంత్రణ కోల్పోయి ఉష్ణోగ్రత పెరుగుతుంది. చర్మం సాగిపోయే గుణం వచ్చి ముడతలుగా తయారు కావడం.
ఇది తగిలితే..
వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిన వ్యక్తిని చల్లని ప్రదేశానికి తరలించాలి. గాలి, వెలుతురు ప్రసరించే ప్రదేశాల్లో పడుకోబెట్టాలి. వేసుకున్న దుస్తులను తొలగించి, నీటితో తడిపిన బట్టతో శరీరాన్ని తుడవాలి. ఉప్ప, పంచదార కలిపిన నీళ్ల, కొబ్బరి నీళ్లను తాగించాలి. కొందరికి వడదెబ్బ తగిలినప్పటికీ చెమట రాదు, ఇటువంటి వారు ఎక్కువ నీళ్లు తాగాలి. వాంతులు, విరేచనలు అవుతుంటే నీరు తాగిస్తూనే ఉండాలి. రోగి పరిస్థితిని బట్టి వైద్యుడిని సంప్రదించాలి. కొందరిలో ఫిట్స్ రావడం, కోమాలోకి జారుకోవడం ఉత్పన్నమైతే ఆస్పత్రికి తరలించాలి.
ఆహారం ఇలా..
ఆకు కూరలు, కూరగాయాలు ఎక్కువగా తీసుకోవాలి. కీర, దోస, పుచ్చ తినడం మంచిది. లేదా ఈ తరహా జ్యూస్ తాగాలి. బిర్యాన్ని, మాంసం, చికెన్, చేపలు, గుడ్డు వంటి వాటికి దూరంగా ఉండాలి. కాఫీ, ధూమ, మద్యపానం, ఫాస్ట్‌ఫుడ్, నూనే ఆహార పదార్థాలు తీసుకోవద్దు. కారం, పచ్చళ్లు, కొన్ని రకాల పప్పులను తక్కువ గా వినియోగించాలి. తెలికగా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టిన ఆహార పదార్థాలు తీసుకోవద్దు. అన్ని రకాల పండ్లను తీసుకోవాలి. తాజాగా ఉండే ఆహారం తీసుకోవాలి.
బయటకు వెళ్తున్నారా..
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లపోవడం మంచిది. తప్పనిసరి అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువ నీటిని తాగాలి. ఎక్కడ పడితే అక్కడ పండ్ల రసాలు, చెరుకు రసాలు, నీరు తాగవద్దు. రోడ్డు మీద అమ్మె తినుబండారాలు తినవద్దు. ఎండకు రక్షణగా గొడుకు, టోపీలు, హెల్మెట్‌ను ధరించాలి. బయటకు వెళ్లినప్పుడు బిగువైన దుస్తులు కాకుండా, వదులుగా ఉండే వాటిని వాడాలి. మంచినీటి బాటిల్‌ను వెంట ఉంచుకోవాలి. తరుచూ తాగుతుండాలి.
అపస్మారక స్థితిలో ఆస్పత్రులకు..
డిహైడ్రేషన్.. బీపీ తగ్గిపోయి, మధుమేహ బాధితుల్లో షుగర్ పెరిగి ఆస్పత్రికి వస్తున్నారు. కొంత మంది సొమ్మసిల్లి ఉండడం, కన్ఫ్యుజన్‌గా ఉండడం, అపస్మారక స్థితిలో ఆస్పత్రికి వస్తున్నారు. ఎండ ఇబ్బందులతో రోజుకు ఓపీకి పది మంది వరకు చికిత్సలు అందిస్తుండగా, మరో ఐదుగురు వరకు అడ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది. 104, 105 జ్వరం తీవ్రతో ఇబ్బంది పడుతున్నారు బీపీ బాధితులు వైద్యుల సలహా మేరకు డోసు తగ్గించుకోవాల్సి ఉంటుంది.
- డాక్టర్ దిలీప్ గుడే, సీనియర్ జనరల్ ఫిజిషియన్, యశోద ఆస్పత్రి
ఈ వార్తలు కూడా చదవండి
ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా
మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..
Read Latest Telangana News and National News