Share News

Mixed Fruit Effects: ఈ పండ్లను కలిపి తింటున్నారా.. మీరు హెల్త్ డేంజర్ జోన్‌ లో ఉన్నట్టే..

ABN , Publish Date - Apr 28 , 2025 | 10:01 AM

Fruit Combinations To Avoid: ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాల్లో పండ్లదే మొదటి స్థానం. కానీ, మీరు ఒకే సమయంలో వేర్వేరు పండ్లను తినాలనుకుంటే మాత్రం అది ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా కొన్ని పండ్ల కలయికలు తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతాయి.

Mixed Fruit Effects: ఈ పండ్లను కలిపి తింటున్నారా.. మీరు హెల్త్ డేంజర్ జోన్‌ లో ఉన్నట్టే..
Fruit Combinations To Avoid

Fruit Mix Ups To Avoid: ఈ మధ్య మిక్స్‌డ్ ఫ్రూట్ ట్రెండ్ పెరిగిపోతోంది. ఒకే రకమైన పండు తినే కంటే వేర్వేరు పండ్లను ఒకేసారి కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది కదా అనుకుంటున్నారు. కానీ, ఈ అభిప్రాయం తప్పు. నిజానికి రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండే పండ్లను వేరే రకాలతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ దెబ్బతిని అల్సర్లు, గ్యాస్ ఇతర అనేక సమస్యలు తలెత్తే ప్రమాదముంది. పండ్లలో ఉండే ఖనిజాలు, విటమిన్లు శరీరానికి సక్రమంగా అంది ఆరోగ్యంగా ఉండాలంటే ఏఏ పండ్లను వేటితో కలిపి తినకూడదో తెలుసుకోండి.


ఆరోగ్యంగా ఉండడానికి పండ్లు తినడం చాలా ముఖ్యం. ఇవి శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలను అందించి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కొన్ని పండ్లలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడానికి సహాయపడతాయి. కొన్నింటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కానీ, చాలామంది అవగాహన లేక మిక్స్‌డ్ ఫ్రూట్స్ పేరుతో రకరకాల పండ్లను ఒకేసారి తినేస్తున్నారు. దీని వల్ల ఎన్ని అనర్థాలు కలుగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.


1) పుచ్చకాయ

పుచ్చకాయను ఎప్పుడూ వేరే పండ్లతో కలిపి తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఇతర పండ్ల కంటే వేగంగా జీర్ణమవుతాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతర పండ్లతో కలిపినప్పుడు అవి సరిగా జీర్ణం కావు. కడుపులో అసౌకర్యం ఏర్పడి ఉబ్బరం, అజీర్ణ సమస్యలు రావచ్చు. పుచ్చకాయలాగే చెర్రీస్, మామిడి పండ్లను కూడా ఏ ఇతర పండ్లతో మిక్స్ చేసి తీసుకోకూడదు.


2) తీపి పండ్లతో సిట్రస్ పండ్లు

ద్రాక్ష, స్ట్రాబెర్రీ, ఆపిల్, దానిమ్మ, పీచెస్ వంటి పండ్లలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. అందుకే సిట్రస్ పండ్లు అంటారు. వీటి తర్వాత అరటిపండ్లు, ఎండుద్రాక్షల్లోనే అధికంగా సి విటమిన్ ఉంటుంది. అయితే తియ్యగా ఉండే పండ్లతో పుల్లటి పండ్లను ఎప్పుడూ తినకూడదు. ఇది అతి చెత్త పండ్ల కలయిక. దీనివల్ల జీర్ణ సమస్యలు, అసిడోసిస్, తలనొప్పి వస్తాయి.


3) బొప్పాయి, నిమ్మకాయ

బొప్పాయి, నిమ్మకాయ కాంబినేషన్ అత్యంత చెత్త పండ్ల కలయికలలో ఒకటి. ఈ రెండు ఆహారాలను కలిపి తీసుకుంటే రక్తహీనత లేదా హిమోగ్లోబిన్ అసమతుల్యత ఏర్పడుతుంది. అందువల్ల, ఈ రెండు పండ్లను వీలైనంత వరకు కలిపి తినడం మానుకోండి.


4) పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయలు పూర్తిగా ఒకదానికొకటి భిన్నమైన ఆహారాలు. పండ్లలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది కూరగాయల జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల, నారింజ పండ్లను క్యారెట్లతో కలపకూడదు. అది కడుపు నొప్పికి కారణమవుతుంది.


Read Also: Summer Headache: ఎండవేడికి తలనొప్పి వస్తోందా.. ఈ టిప్స్ పాటిస్తే వెంటనే రిలీఫ్..

Brown Rice or White Rice: బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..

Health Tips: ఉదయం నిద్ర లేవగానే ఇలా చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది..

Updated Date - Apr 28 , 2025 | 11:27 AM