Share News

Fake vs Real ORS: నకిలీ ORS తో ఆరోగ్యానికి పెద్ద ముప్పు.. అసలైనది గుర్తించడమెలా..

ABN , Publish Date - Apr 25 , 2025 | 01:23 PM

Tips To Identify Fake ORS: వేసవికాలం కావడంతో ప్రస్తుతం ORS ప్యాకెట్లకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో నకిలీలు విచ్చలవిడిగా మార్కెట్లోకి ప్రవహిస్తున్నాయి. వీటివల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కాబట్టి నిజమైన, నకిలీ ORS ప్యాకెట్లకు మధ్య తేడాలను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

Fake vs Real ORS: నకిలీ ORS తో ఆరోగ్యానికి పెద్ద ముప్పు.. అసలైనది గుర్తించడమెలా..
Tips To Identify Fake ORS

Fake ORS Identification: ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల చెమట విపరీతంగా కారిపోతూ ఉంటుంది. శరీరంలో నీటి స్థాయిలు వేగంగా పడిపోయి డీహైడ్రేషన్ సమస్యకు దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు విరేచనాలు, వాంతులు, తీవ్ర అలసటతో బాధపడుతుంటారు . ఈ సమస్య నుంచి నుంచి ఉపశమనం పొందడానికి వైద్యులు సాధారణంగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. శరీరంలో నీరు, అవసరమైన ఖనిజాల లోపాన్ని తక్షణమే తీర్చేందుకు ORS సహాయపడుతుంది. కానీ వేసవిలో ORSకి పెరుగుతున్న డిమాండ్ కారణంగా మార్కెట్లో నకిలీలను తయారుచేసి విడుదల చేస్తున్నారు మోసగాళ్లు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతతో సహా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, నకిలీ ORS దుష్ప్రభావాల నుంచి రక్షించుకునేందుకు డాక్టర్ పవన్ మాండవీయ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రజలను సూచనలు ఇచ్చాడు. నిజమైన, నకిలీ ORS మధ్య వ్యత్యాసాన్ని ఎలా గుర్తించాలో స్పష్టంగా వివరించారు.


నకిలీ ORS శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యతను కలిగించి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. నకిలీ ORS దుష్ప్రభావాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీరు నిజమైన, నకిలీ ORS మధ్య తేడాలను ఇలా గుర్తించండి.

ప్యాకెట్‌ పరిశీలన

నిజమైన ORS ని ప్యాకెట్‌ని క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఎలాగంటే, ORS కొనడానికి వెళ్ళినప్పుడల్లా ముందుగా దానిపై 'WHO ఫార్ములా ఆధారంగా' అని రాసి ఉందో నిర్ధారించుకోండి. ప్యాక్ పై FSSAI మార్క్ మాత్రమే ఉండి WHO ఫార్ములా ప్రస్తావించకపోతే అది కేవలం ఎనర్జీ డ్రింక్ మాత్రమే అని అర్థం.


జాబితా చదవండి

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 21 గ్రాముల అసలు ORS ప్యాకెట్‌లో 2.6 గ్రాముల సోడియం క్లోరైడ్, 2.9 గ్రాముల సోడియం సిట్రేట్, 1.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 13.5 గ్రాముల డెక్స్‌ట్రోస్ ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన విధంగానే ఇంగ్రిడియెంట్స్ నిష్పత్తులు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.


ప్యాకేజింగ్

నిజమైన ORS ప్యాకెట్లపై బ్రాండ్ లోగో, బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీ, FSSAI లైసెన్స్ నంబర్ స్పష్టంగా ముద్రించి ఉంటాయి. నకిలీ ప్యాకెట్లలో అస్పష్టమైన ముద్రణ, తప్పు స్పెల్లింగ్ లేదా అసంపూర్ణ సమాచారం ఉండవచ్చు.


రంగు, ఆకృతి

అసలైన ORS పౌడర్ తెలుపు రంగులో ఉంటుంది. మెత్తగా, ముట్టుకుంటే జారిపోయేలా అనిపిస్తుంది. అలాకాక పౌడర్ పసుపు, గోధుమ రంగు లేదా జిగటగా ఉంటే అది నకిలీ కావచ్చు. ఇంకా చెప్పాలంటే నకిలీ ORS పౌడర్ వాడి చేసే ద్రావణం కొద్దిగా ఉప్పగా ఉంటుంది. తియ్యగా ఉండదు.


రుచి

అసలు ORS రుచి కొద్దిగా ఉప్పగా, కొద్దిగా తీపిగా ఉంటుంది. నకిలీ ORS లలో అధిక మొత్తంలో చక్కెర ఉండవచ్చు. ఇది ఎనర్జీ డ్రింక్ లాగా రుచిగా ఉంటుంది.


Read Also: Vitamin D: ఉదయాన్నే ఈ పని చేస్తే.. విటమిన్ D లోపం ఎప్పటికీ రాదు..

Constipation: ఈ కూరగాయలంటే మీకిష్టమా.. జాగ్రత్త.. ఇవి తింటే మలబద్ధకం..

Popcorn Lung Disease: పాప్ కార్న్ ఊపిరితిత్తుల వ్యాధి గురించి విన్నారా.. వీరికే ఎక్కువగా వచ్చే ఛాన్స్..

Updated Date - Apr 25 , 2025 | 01:24 PM