Share News

Diabetics: డయాబెటిస్ ఉన్నవారు నెయ్యి తినొచ్చా.. డాక్టర్లు ఏమంటున్నారు..

ABN , Publish Date - Apr 28 , 2025 | 01:13 PM

Ghee For Diabetics: నెయ్యి సహజ కొవ్వు పదార్థం. ఆహార రుచిని కూడా రెట్టింపు చేస్తుంది. కానీ, మధుమేహ వ్యాధిగ్రస్తులకు నెయ్యి మంచిదేనా..ఇది తింటే షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయ.. డాక్టర్లు ఏమంటున్నారు..

Diabetics: డయాబెటిస్ ఉన్నవారు నెయ్యి తినొచ్చా.. డాక్టర్లు ఏమంటున్నారు..
Ghee For Diabetics

Ghee For Diabetics: అనాది కాలం నుంచి భారతీయుల వంటగదుల్లో నెయ్యికి ప్రత్యేక స్థానముంది. నూనెల కంటే నెయ్యి వల్ల ఆహార పదార్థాలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. పోషకాలు ఎక్కువే. స్వీట్లు, రోటీలు, పప్పు, ఇలా అనేక రకాల ఆహార పదార్థాల్లో వేయడంతో పాటు పూజ ద్రవ్యంగా కూడా వినియోగిస్తారు. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థంగా పరిగణించే నెయ్యిని డయాబెటిస్ ఉన్నవారు తినొచ్చా. షుగర్ లెవెల్స్ అదుపు చేసే శక్తి నెయ్యికి ఉందా.. దీనిపై డాక్టర్ల సలహా ఏమిటో తెలుసుకుందాం..


డయాబెటిస్ రోగులు నెయ్యి తినొచ్చా?

డయాబెటిస్ రోగులు గ్లైసెమిక్ ఇండెక్స్ భయంతో ఆహారాన్ని ఎంచుకునే విషయంలో తికమక పడుతుంటారు. ఎందుకంటే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. ఇది ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. అదే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ తిన్నారంటే గ్లూకోజ్ విడుదల నెమ్మదించి చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. నెయ్యి గురించి మాట్లాడుకుంటే ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. పోషకాహార నిపుణుల ప్రకారం నెయ్యి జోడించడం వల్ల ఆహారం పదార్థాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. అంటే షుగర్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసుకునేందుకు బేషుగ్గా నెయ్యిని తినవచ్చు.


నెయ్యిని ఎలా ఉపయోగించాలి?

నెయ్యి ఆహార రుచిని పెంచుతుంది. కాబట్టి చాలామంది భోజనం చేసేటప్పుడు ఆహార పదార్థాల్లో ఎక్కువగా కలుపుకుని తినేస్తుంటారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా షుగర్ ఉంటే మాత్రం నెయ్యిని ఎంత మోతాదులో తినాలో కచ్చితంగా తెలుసుకోవాలి. పప్పు లేదా అన్నంలో ఒకటి కంటే ఎక్కువ చెంచాల నెయ్యి వేయకూడదు. అధిక కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారంలో ఒక చెంచా నెయ్యి మాత్రమే జోడించాలి. స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే వాడటానికి ప్రయత్నించాలి. వీలైతే ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది.


ఎప్పుడు తినకూడదు?

గర్భధారణ సమయంలో మీరు అధిక బరువుతో ఉంటే తక్కువ నెయ్యి తినండి. ఇది కాకుండా సిర్రోసిస్, స్ప్లెనోమెగలీ, హెపటోమెగలీ, హెపటైటిస్ వంటి మూత్రపిండాలు, గుండె లేదా కాలేయ వ్యాధులు ఉంటే నెయ్యిని తినకూడదు. అజీర్ణం, కడుపు సమస్యలతో ఉన్నా కూడా నెయ్యి తినకండి.


Read Also: Walking - Resistance Training: అతిగా వాకింగ్ చేస్తున్నారా? చిక్కుల్లో పడ్డట్టే..

Mixed Fruit Effects: ఈ పండ్లను కలిపి తింటున్నారా.. మీరు హెల్త్ డేంజర్ జోన్‌ లో ఉన్నట్టే..

Summer Headache: ఎండవేడికి తలనొప్పి వస్తోందా.. ఈ టిప్స్ పాటిస్తే వెంటనే రిలీఫ్..

Updated Date - Apr 28 , 2025 | 01:14 PM