Night Vision Technology: సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..
ABN , Publish Date - May 26 , 2025 | 10:10 AM
Night Vision Contact Lenses: చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేశారు శాస్త్రవేత్తలు. అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసి చూపించారు. తాజాగా సైంటిస్టులు అభివృద్ధి చేసిన 'సూపర్-విజన్' కాంటాక్ట్ లెన్స్ కూడా ఆ కోవలోకే వస్తుంది. దీని సాయంతో ఇకపై చీకట్లోనే కాదు. కళ్లు మూసుకున్నా ఏం చక్కా చూసేయచ్చు.

Scientists Develop Super Vision Contact Lense: టెక్నాలజీ సాయంతో సామాన్య ప్రజలు సైతం సరికొత్త కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తున్నారు. ఇక వివిధ రంగాల్లోని సైంటిస్టులైతే రోజుకో వినూత్న ఆవిష్కరణలతో దూసుకుపోతున్నారు. తాజాగా సైంటిస్టులు సృష్టించిన 'సూపర్-విజన్' ఇన్‌ఫ్రారెడ్ కాంటాక్ట్ లెన్స్ టెక్నాలజీ అయితే అద్భుతమనే చెప్పాలి. దీని సాయంతో చీకట్లోనే కాదు. కళ్ళు మూసుకుని కూడా భేషుగ్గా చూసేయచ్చు. దీనికి సంబంధించిన అధ్యయనం సెల్ జర్నల్‌లో ప్రచురితమైంది. చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనిపెట్టిన ఈ అద్భుత టెక్నాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం..
చీకటిలో, కళ్ళు మూసుకుని కూడా చూడటానికి సహాయపడే ఇన్‌ఫ్రారెడ్ కాంటాక్ట్ లెన్స్‌లను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ అధ్యయనం సెల్ జర్నల్‌లో ప్రచురితమైంది. చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అద్భుత ఆలోచనకు ప్రాణం పోశారు. సాంప్రదాయ కాంటాక్ట్ లెన్స్‌లలో కనిపించే పాలిమర్‌లను నానోపార్టికల్స్‌తో కలిపి చీకటిలో చూడటానికి వీలు కల్పించే లెన్స్‌లను రూపొందించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ లెన్స్‌లకు సాధారణ నైట్-విజన్ గాగుల్స్ లాగా విద్యుత్ అవసరం లేదని కూడా అధ్యయనం చెబుతోంది.
ఈ లెన్స్‌లు పారదర్శకంగా ఉంటాయి. వివిధ ఇన్‌ఫ్రారెడ్ ఫ్రీకెన్సీ గ్రహించే సామర్థ్యం ఉంటుంది. కాంటాక్ట్ లెన్స్‌లో ఉపయోగించే నానోపార్టికల్స్ ఇన్‌ఫ్రారెడ్ కాంతిని గ్రహించి క్షీరదాల కళ్ళకు కనిపించే (తరంగదైర్ఘ్యాలు) ఫ్రీక్వెన్సీలోకి మారుస్తాయి. అందువల్ల ధరించిన వ్యక్తి ఇన్‌ఫ్రారెడ్, దృశ్య కాంతి రెండింటినీ ఒకేసారి చూడగలడు. కళ్ళు మూసుకున్నప్పుడు అయితే ఇన్‌ఫ్రారెడ్ దృష్టి మరింత మెరుగుపడినట్లు పరిశోధనలో తేలింది. ఇన్‌ఫ్రారెడ్ లైట్ ద్వారా ప్రకాశించే వాటి కంటే డార్క్ బాక్స్‌లను ఇష్టపడే ఎలుకలపై మొదట ఈ లెన్స్ పరీక్ష నిర్వహించారు. లెన్స్‌లు లేని ఎలుకలు ఎటువంటి ప్రాధాన్యతను చూపించలేకపోయాయి. తరువాత, ఈ లెన్స్‌లను మానవులపై ప్రయత్నించారు. వారు మినుకుమినుకుమనే పరారుణ కాంతిని గుర్తించి దాని దిశను గ్రహించగలిగారు. కళ్ళు మూసుకున్నప్పుడు తమ దృష్టి సామర్థ్యం మరింత పెరిగినట్లు పరిశోధనలో పాల్గొనేవారు వెల్లడించారని సైంటిస్టులు చెబుతున్నారు.
చైనాలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో న్యూరో సైంటిస్ట్, రచయిత టియాన్ జుయే ఈ అధ్యయనం గురించి మాట్లాడుతూ, 'మా పరిశోధన నాన్-ఇన్వాసివ్ పరికరాలను ధరించగలిగే ప్రజలకు సూపర్-విజన్ ఇవ్వడానికి సామర్థ్యాన్ని అందిస్తుంది. దీని వల్ల అనేక రంగాల్లో ప్రయోజనాలు కలుగుతాయి. భద్రత, రెస్క్యూ, ఎన్‌క్రిప్షన్ లేదా నకిలీ నిరోధక సెట్టింగ్‌లలో సమాచారాన్ని ప్రసారం చేయడానికి మినుకుమినుకుమనే ఇన్‌ఫ్రారెడ్ కాంతిని ఉపయోగించవచ్చు' అని అన్నారు.
'ఈ సాంకేతికత విస్తృత రంగాలలో ఆచరణాత్మక ప్రయోజనాలు అందించగలదు. ఇన్ఫ్రారెడ్ సమాచార ఎన్ కోడింగ్, ప్రసారం, పేలవమైన దృశ్యమాన పరిస్థితులలో (ఉదా., పొగమంచు లేదా దుమ్ముతో కూడిన పరిస్థితులు) మెరుగైన దృష్టి, రెస్క్యూ, అత్యవసర పరిస్థితుల కోసం స్మార్ట్ పరికరాలతో జత చేసి వాడుకోవచ్చు' అని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రాథమిక ప్రయోగ దశ (ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్)లోనే ఉంది. అయినప్పటికీ, భవిష్యత్తులో ఈ సూపర్ విజన్ లెన్స్ దృష్టి లోపాలున్న వారికి అపూర్వమైన కానుక అని సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు.
Also Read:
రక్తదానం చేయడానికి హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..