Health Tips: ఈ పండ్లు తిన్నాక నీరు తాగితే.. కడుపులో ఏ సమస్యలు వస్తాయో తెలుసా..
ABN , Publish Date - Apr 20 , 2025 | 09:40 AM
Fruits Not To Drink Water After: పండ్లు తిన్న తర్వాత అలవాటు కొద్దీ, బాగా జీర్ణమవుతుందనో నీళ్లు తాగేస్తుంటారు. ఇది కేవలం పొరపాటు మాత్రమే కాదు. ఆరోగ్యానికి ప్రమాదకరం కూడా. ఇలా చేస్తే పోషకారహారమైన పండ్లు కడుపును విషపూరితం చేస్తాయి. కాబట్టి, జాగ్రత్త..

Avoid Drinking Water After Eating Fruits: చిన్నప్పటి నుంచి మీ అమ్మమ్మ లేదా ఇంట్లోని పెద్దలు ఎవరైనా ఫలానా పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని చెప్పడం మీరు వినే ఉంటారు. నిజానికి, ఏ పదార్థమైనా తినడానికి ఓ సరైన పద్ధతి ఉంటుంది. దానిని పాటించకపోతే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం పండ్లనే తీసుకుందాం. పండ్లు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని పండ్లను తిన్న తర్వాత నీరు తాగితే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే బదులు అపారమైన హానిని కలిగిస్తాయి. కాబట్టి, ఏ పండ్లు తిన్న వెంటనే నీరు తాగకూడదు. ఎంతసేపటికి తాగితే మంచిదో తెలుసుకుందాం.
అరటిపండు
అరటిపండు ఏడాది పొడవునా లభిస్తుంది. అందరూ క్రమం తప్పకుండా తినే ఈ పండులో కాల్షియం, పొటాషియం, ఫైబర్ సహా అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. అయితే, అరటిపండు తిన్న వెంటనే నీరు తాగితే మాత్రం కచ్చితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిజానికి, ఇది శరీరంలో ఇన్సులిన్ మొత్తాన్ని పెంచి రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, అరటిపండు తిన్న తర్వాత కనీసం 20 నిమిషాల గ్యాప్ తీసుకునే నీరు తాగాలి.
పుచ్చకాయ
వేసవిలో తాజా పుచ్చకాయ తినడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు? ఫైబర్, నీటితో సమృద్ధిగా ఉండే పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే పుచ్చకాయలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ పెద్ద మొత్తంలో ఉంటుంది. అందువల్ల, మీరు పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే అది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
ఆపిల్
ఆపిల్ తిన్న వెంటనే నీరు తాగడం మానేయాలి. నిజానికి, ఆపిల్‌లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు, మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే మీరు ఆపిల్ తిన్న వెంటనే నీరు తాగారంటే ఫైబర్ పేగులకు చేరదు. దీని కారణంగా జీర్ణక్రియలో సమస్యలు తలెత్తవచ్చు. ఇదే కాక కడుపులో గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి.
దానిమ్మ
దానిమ్మపండు తినడానికి అందరూ ఇష్టపడతారు. దీనిలోని తియ్యటి ఎర్రటి గింజలు నమలడానికి రుచికరంగా ఉంటాయి. వాటి రసం కూడా చాలా ఆరోగ్యకరమైనది. కానీ దానిమ్మ తిన్న వెంటనే నీరు తాగితే ఆరోగ్యానికి హానికరం. ఇలా చేయడం వల్ల వికారం, వాంతులు, కడుపులో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, దానిమ్మపండు తిన్న అరగంట తర్వాత మాత్రమే నీరు తాగాలి.
పుల్లని పండ్లు
ద్రాక్ష, నిమ్మ, నారింజ, ఉసిరి, బత్తాయి వంటి పుల్లని పండ్లు తిన్న తర్వాత నీరు తాగడం మంచిది కాదు. తెలియక ఇలా చేస్తే శరీరంలో pH స్థాయి క్షీణిస్తుంది. దీనితో పాటు జీర్ణ సమస్యలు కూడా సంభవించవచ్చు. మీకు గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు ఉంటే పుల్లని పండ్లు తిన్న తర్వాత పొరపాటున కూడా నీరు తాగకూడదు.
Read Also: Low Sugar Diet: డయాబెటిస్ భయంతో చక్కెర తినడం తగ్గించారా.. ఇలా చేస్తే ఏం జరుగుతుంది..
Mangoes: మామిడిపండు తినగానే ఈ 5 పదార్థాలు తినకండి.. చాలా ప్రమాదకరం..
Jamun Benefits: నేరేడు పండ్ల విత్తనాలు పారేస్తున్నారా.. ఇలా వాడితే ఆ సమస్యలు పోతాయ్..