UTI symptoms: మహిళలూ.. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్లతో జాగ్రత్త..!
ABN , Publish Date - Jul 20 , 2025 | 07:30 PM
మహిళలకు మూత్ర నాళ ఇన్ఫెక్షన్ (UTI) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే UTI లను సులువుగా అరికట్టవచ్చు. స్త్రీలల్లో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ఉందని చెప్పే 5 నిశ్శబ్ద సంకేతాలు ఇక్కడ ఉన్నాయి.

వయసు పెరిగే కొద్ది అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా మహిళలకు మూత్ర కోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ ప్రమాదకరమైనదనే చెప్పాలి. చాలా సందర్భాలలో UTIలు మూత్రాశయానికి మాత్రమే పరిమితం అవుతాయి. అత్యంత బాధాకరమైన నొప్పిని పంటిబిగువన భరిస్తూనే చికిత్స విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు అధికమంది స్ర్తీలు. కానీ సరైన మందులతో ఈ సమస్యను నయం చేసుకోవచ్చు. ఈ విషయంలో అప్రమత్తం కాలేదంటే మాత్రం ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత పరిస్థితి అత్యంత దారుణంగా మారుతుంది. కాబట్టి, ప్రారంభ దశలోనే UTIలను గుర్తించినట్లయితే సమస్య త్వరగా పరిష్కారమవుతుంది. మూత్ర నాళ ఇన్ఫెక్షన్‌ను ఈ కింది సంకేతాల ద్వారా గుర్తించండి.
మూత్ర విసర్జన చేయాలనే కోరిక పెరగడం
తక్కువ మూత్రం వచ్చినప్పటికీ అకస్మాత్తుగా, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. చాలా మంది దీనిని ఓవర్ హైడ్రేషన్ లేదా ఆందోళనగా పొరబడతారు. కానీ తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక UTI కారణంగా వస్తుంది. ఇది మూత్రాశయ పనితీరు సరిగాలేదని చెప్పే సంకేతం అని భావించాలి.
అసాధారణ అలసట
స్పష్టమైన కారణం లేకుండా మీరు అసాధారణంగా అలసిపోయినట్లు లేదా శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే అది UTI కి సంకేతం కావచ్చు. తక్కువ-గ్రేడ్ UTI వంటి తేలికపాటి ఇన్ఫెక్షన్లు కూడా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి. ఇది అలసటకు కారణమవుతుంది.
బలమైన వాసన కలిగిన మూత్రం
మూత్రం మురికిగా కనిపించినప్పుడు లేదా ఘాటైన, అమ్మోనియా లాంటి వాసన కలిగి ఉన్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. నొప్పి లేదా మంట అనుభూతి చెందక ముందే ఈ మార్పు సంభవించవచ్చు.
పెల్విక్ అసౌకర్యం లేదా ఒత్తిడి
పొత్తి కడుపు లేదా పెల్విక్ ప్రాంతంలో తేలికపాటి నొప్పి లేదా భారంగా అనిపిస్తున్నప్పటికీ మహిళలు తరచుగా ఈ సూక్ష్మ సంకేతాన్ని విస్మరిస్తారు. దీనిని ఋతుక్రమంలో వచ్చే మార్పుల వల్ల కలిగే నొప్పులు లేదా ఉబ్బరం అని తప్పుగా భావిస్తారు.
తేలికపాటి వెన్నునొప్పి
నడుము దిగువ భాగంలో, ముఖ్యంగా మూత్రపిండాల దగ్గర నిరంతర నొప్పి యూటీఐకు సంకేతం. ఎగువ మూత్ర నాళాన్ని ఇన్ఫెక్షన్ ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ లక్షణం ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకపోతే మూత్రపిండాలు ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదముంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ప్రతిరోజూ లెమన్ జ్యూస్ తాగితే అసిడిటీ వస్తుందా?
భోజనం చేసిన వెంటనే ధూమపానం.. ఇలా చేస్తే రిస్క్‌లో పడ్డట్టే..
For More Health News