Share News

NTR Trust: తలసీమియా బాధితుల కోసం విశాఖలో రన్.. స్పందించిన సీఎం

ABN , Publish Date - Jul 20 , 2025 | 06:26 PM

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా నిర్వహించిన తలసీమియా రన్ కార్యక్రమం విజయవంతం కావడంపై సీఎం చంద్రబాబు స్పందించారు.

NTR Trust: తలసీమియా బాధితుల కోసం విశాఖలో రన్.. స్పందించిన సీఎం
AP CM Chandrababu naidu

అమరావతి, జులై 20: తలసీమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టు అండగా నిలబడుతుంది. ఆ వ్యాధి బాధితుల కోసం శనివారం సాయంత్రం అంటే.. జులై 19వ తేదీ విశాఖపట్నం సాగర తీరంలో తలసీమియా రన్‌ను ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రన్‌లో లక్షలాది మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

Nara-Bhuvaneshwari-01.jpg


ఆయన ఏమన్నారంటే.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా తలసీమియా బాధితులకు అండగా నిలవాలనే మా ప్రయత్నానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనకు వందనాలు. తలసీమియా బాధితుల కోసం విజయవాడలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తే వందల మంది ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేశారు. ప్రమాదకరమైన ఈ వ్యాధిపై చైతన్యం తెచ్చేందుకు, బాధితులకు అండగా ఉండేందుకు విశాఖ సాగర తీరంలో శనివారం సాయంత్రం నిర్వహించిన తలసీమియా రన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ మద్దతు తెలియజేశారు. ఒక మంచి కార్యక్రమం చేపడితే ప్రజలు ఎంత మద్దతుగా ఉంటారో చెప్పడానికి ఈ స్పందనే ఉదాహరణ. అందరికీ ధన్యవాదాలు. మీ అందరి మద్దతుతో మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలను మరింత విస్తృతం చేస్తాం.. అని పేర్కొన్నారు.

Nara-Bhuvaneshwari-02.jpg


ఈ తలసీమియా బాధితుల కోసం విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ తమన్ సారథ్యంలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అలాగే శనివారం సాయంత్రం విశాఖపట్నంలో సైతం తలసీమియా బాధితుల కోసం రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమం కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయింది.

S-S-Thaman.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంటర్మీడియట్ విద్యార్థులకు తల్లికి వందనం నిధులు విడుదల

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 20 , 2025 | 06:35 PM