Share News

Jubilee Hills Women: జూబ్లీ విజయం.. ఆమే కీలకం

ABN , Publish Date - Nov 08 , 2025 | 10:52 AM

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే ఈ ఎన్నికలో మహిళల ఓట్లు కీలకంగా మారునున్నాయి.

Jubilee Hills Women: జూబ్లీ విజయం.. ఆమే కీలకం

  • అతివల ఓట్లు కొల్లగొట్టడం పైనే ప్రధాన పార్టీల గురి

  • సీమంతాలు, అన్నప్రాసనలు. గృహోపకరణాలతో ఎర

  • ప్రచారపర్వంలోనూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం

  • మహిళా సంఘాలపై దృష్టి.. వివరాల సేకరణలో నిమగ్నం

హైదరాబాద్ సిటీ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్ని కలో మహిళల ఓట్లే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు 'ఆమె' కేంద్రంగానే ప్రచార వ్యూహాలను రచిస్తున్నాయి. కీల కమైన అతివల ఆశీస్సులు గంపగుత్తగా పొందగలిగితే తాము విజయం సాదించడం నల్లేరు మీద నడకే అని అభ్యర్థులు భావిస్తున్నారు. వారిని తమ వైపు తిప్పుకుంటే ఆయా కుటుంబాల్లోని ఓట్లు సంపూర్ణంగా తమకే పడే అవ కాశాలు ఉంటాయని బలంగా నమ్ముతున్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఉన్న దివంగత మాగంటి గోపీనాథ్ విజయంలో మహిళల ఓట్లు కీలకంగా ఉండేవి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన కుమార్తెలతో కలిసి నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీనాయాదవ్ సతీమణి తన భర్తకు విజయాన్ని చేకూర్చేందుకు నడుం బిగించారు. ఇంటింటికీ తిరుగుతూ గృహిణులను అప్యా యంగా పలకరిస్తూ ఇంటిల్లిపాదీ తమకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తమ పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలను రంగంలోకి దించి దీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.


ముందుగానే వారిని ఆకట్టుకుని..

ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. అభ్యర్థిత్వం ఖరారు కాకపోయినప్పటికీ.. ఓ ప్రధాన పార్టీ ఆశావహుడు మూడు నెలల క్రితం నుంచే నియోజకవర్గంలో గర్భిణులకు సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసనలు చేయించారు. చీర, సారెలు అందజేసి మహిళామణులను విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం ఆయనకే అభ్యర్థిత్వం ఖరారు కావడం కొసమెరుపు. మరో పార్టీ అభ్యర్థి సైతం బతుకమ్మ - ఉత్సవాల సందర్భంగా అన్ని డివిజన్లలో పెద్దఎత్తున బహుమతులు అందజేశారు.


తాయిలాలు అందించేందుకు ప్రత్యేక బృందాలు..

పురుషులతో పోల్చితే మహిళల ఓట్లే నమ్మకంగా పడతాయని వాటిని కొల్లగొట్టేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గతంలో ఓ ప్రజాప్రతినిధి గెలుపు బాటలో పయనించడానికి మహిళామణుల ఆదరణ పొందగలగడమే ప్రధాన కారణమంటున్నారు. వారికి కుక్కర్లు వంటి గృహోపకరణాలు పంపిణీ చేసి ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళల ఓట్లను గంపగుత్తగా వేయించుకోవడానికి మహిళా సంఘాలపై దృష్టి కేంద్రీకరించారు. ప్రత్యేక బృందాల ద్వారా ఆయా సంఘాల్లోని మహిళల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. వారితో సమావేశాలు నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థి తరపున నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఒక విధంగా.. తెరవెనుక సహకరించే మహిళా సంఘాలకు మరో రకంగా తాయిలాలు అందించాలని నిర్ణయానికి వచ్చారు.


అన్ని పార్టీలకు జైకొడుతూ..

బస్తీలు, కాలనీల్లో సభలు, సమావేశాలు నిర్వ హించేటపుడు పార్టీల నేతలు మహిళా సంఘాల లీడర్లను ఆశ్రయిస్తున్నారు. ఆయా సంఘాల నుంచి పాల్గొన్న ప్రతి ఒక్కరికీ రూ.500 చొప్పున చెల్లిస్తు న్నారు. దీంతో ఈ కార్యక్ర మాలకు మహిళలే అధి కంగా హాజరవుతున్నారు. వారి లీడర్లు నిర్వాహకుల నుంచి రూ.500 చొప్పున తీసుకొన్నా. వారికి మాత్రం రూ.400 చొప్పునే ఇస్తు న్నారు. ఏ పార్టీ నేతలు ఆహ్వానించినా మహిళామ ణులు వెళ్తున్నారు..వారికి జై కొడుతున్నారు. ఈ నేప థ్యంలో వారంతా ఓటెవరికి వేస్తారనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇంటింటికీ పంపిణీ చేసే డబ్బుల కంటే మహిళా సంఘాల ద్వారా నేరుగా సభ్యులకు అందించే తాయి లాలతోనే అధికంగా ఓట్లు వస్తాయని ప్రచారకర్తలు భావిస్తున్నారు.. అందుకోసం తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు.


ఇవి కూడా చదవండి:

షుగర్ వ్యాధి ఉంటే ఇక వీసా రానట్టే.. అమెరికా నిబంధనలు మరింత కఠినతరం

హెబ్-1బీ వీసా.. లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం

Updated Date - Nov 08 , 2025 | 01:02 PM