CP Sajjanar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 08:10 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ పలు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపులని నిబంధనల మేరకు బంద్ చేయాలని ఆదేశించారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
హైదరాబాద్, నవంబరు8 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By Election) నేపథ్యంలో పలు ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (CP Sajjanar) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇవాళ(శనివారం) ఓ ప్రకటన విడుదల చేశారు సీపీ సజ్జనార్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో మద్యం అమ్మకం, సర్వింగ్‌పై పూర్తిగా నిషేధం విధించినట్లు ప్రకటించారు. ఈ నెల 9వ తేదీ(ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ (మంగళవారం) సాయంత్రం 6 గంటల వరకు పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు సీపీ సజ్జనార్.
ఈ నెల 14వ తేదీ(శుక్రవారం) ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ (శనివారం) ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధిస్తున్నట్లు తెలిపారు. అన్ని వైన్ షాపులు, బార్లు, స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బులు బంద్ చేయిస్తున్నట్లు వెల్లడించారు. లైసెన్స్ ఉన్నా కూడా ఈ రోజుల్లో మద్యం సర్వ్ చేయడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్, కౌంటింగ్ డే రోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు.
శాంతిభద్రతల నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండటం నిషేధమని చెప్పుకొచ్చారు. ఓట్ల లెక్కింపు రోజున రోడ్లు, జనావాసాల్లో టపాసులు కాల్చడం నిషేధమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలని ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్
ఓటు హక్కుని బీజేపీ కాలరాస్తోంది.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News and National News