Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. తొలి మూడు రౌండ్లలో ముందంజలో కాంగ్రెస్
ABN , Publish Date - Nov 14 , 2025 | 09:45 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే, తొలి 3 రౌండ్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
హైదరాబాద్, నవంబరు14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ(శుక్రవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే, తొలి మూడు రౌండ్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ - 8,926 ఓట్లు, బీఆర్ఎస్ -8,864 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్‌లో 47ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ - 8911, బీఆర్ఎస్ - 8864, బీజేపీ - 2267 వచ్చాయి.
మొదటి రౌండ్ ముగిసే వరకు కాంగ్రెస్ 47ఓట్లతో లీడ్‌లో ఉంది. రెండో రౌండ్‌లో కాంగ్రెస్-9,691 ఓట్లు, బీఆర్ఎస్ - 8,609 ఓట్లు పడ్డాయి. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీకి - 317 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో 2216 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. మూడో రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనపరుస్తోంది. తొలి మూడు రౌండ్లలో 3,400 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ దూసుకెళ్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ గెలుపు ఖాయం: మాగంటి సునీత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ అధిక్యత
Read Latest Telangana News and National News