Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ గెలుపు ఖాయం: మాగంటి సునీత
ABN , Publish Date - Nov 14 , 2025 | 09:25 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్, నవంబరు14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bye ELection) కౌంటింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. తమకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సంబంధం లేదని.. ప్రజలు తమకు ఓటేశారని ఉద్ఘాటించారు. ప్రతీ చిన్న అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని తమ ఏజెంట్‌లకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.
అయితే, కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు ప్రధాన పార్టీల ఏజెంట్లు. కౌంటింగ్ సెంటర్‌లోకి తన వెంట ఇద్దరు ఏజెంట్‌లను లోపలకి అనుమతి ఇవ్వాలని చెప్పారు మాగంటి సునీత. ఆమె అభ్యర్థనకు అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు, ఎన్నికల సిబ్బంది. ఒక అభ్యర్థికి, ఒక ఏజెంట్‌కు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు పోలీసులు. ఈ క్రమంలో సునీతతో కేవలం ఒక ఏజెంట్‌ను మాత్రమే కేంద్రం లోపలికి అనుమతి ఇచ్చారు ఎన్నికల సిబ్బంది, పోలీసులు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ రిజర్వేషన్లు భిక్ష కాదు.. మా హక్కు
సోయా, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో సడలింపులివ్వండి
Read Latest Telangana News and National News