TS EAMCET 2025: తెలంగాణ ఈఏపీసెట్ హాల్‌టికెట్ విడుదల.. డౌన్‌లోడ్ డైరెక్ట్ లింక్, డ్రెస్ కోడ్ తదితర వివరాల కోసం
ABN , Publish Date - Apr 19 , 2025 | 06:37 PM
TS EAPCET Hall Ticket 2025 Released: టీఎస్ EAMCET 2025 హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు లాగిన్ పేజీలో వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, ఇతర వివరాలను ఉపయోగించి వారి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు తదితర పూర్తి వివరాల కోసం..

Download TS EAPCET 2025 Hall Ticket: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ఈరోజు EAPCET 2025 హాల్ టికెట్లు విడుదల చేసింది. వ్యవసాయం, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 19, 2025న పరీక్ష కోసం అడ్మిట్ కార్డులు/హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులోకి తెచ్చింది. TS EAMCET 2025 పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు eapcet.tgche.ac.inలో అందుబాటులో ఉన్న లాగిన్ పేజీలో ఆధారాలను ఉపయోగించి తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAPCET) ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరగనుంది. ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్ష మే 2 నుంచి 5 వరకూ నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ TS EAPCET హాల్ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్‌ను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.
TS EAMCET 2025 హాల్ టికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
అధికారిక వెబ్సైట్ eapcet.tgche.ac.in ని సందర్శించండి.
'TS EAMCET 2025 hall ticket' లింక్‌పై క్లిక్ చేయండి.
లాగిన్ పేజీకి వెళ్లి వివరాలు నమోదు చేయండి.
TS EAMCET 2025 హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
భవిష్యత్తు అవసరాల కోసం TS EAPCET 2025 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి.
TS EAMCET 2025 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం
పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేని వస్తువులు
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ వస్తువులను తమతో తీసుకెళ్లకూడదు. అధికారిక TS EAMCET 2025 మార్గదర్శకాలలో పేర్కొన్న నిషేధిత వస్తువుల జాబితాను కచ్చితంగా పాటించాలి. అవేంటంటే..
మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు, పేజర్లు లేదా ఏవైనా ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్‌లు.
పుస్తకాలు, నోట్స్, లాగ్ టేబుల్స్ , ముద్రించిన విడి కాగితాలు లేదా రాసిన కాగితాలు.
చెవిపోగులు, గాజులు, ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, గొలుసులు వంటి ఆభరణాలు, ఉపకరణాలు.
గడియారాలు, పర్సులు, హ్యాండ్‌బ్యాగులు లేదా ఏ రకమైన బ్యాగ్ వంటి వ్యక్తిగత వస్తువులకు అనుమతి లేదు.
దుస్తుల కోడ్
పరీక్షకు సంబంధించిన డ్రెస్ కోడ్‌ను పరీక్షా అధికారులు పేర్కొనలేదు. అయితే, అభ్యర్థులు ఫుల్-స్లీవ్ దుస్తులు, టోపీలు లేదా తలను కప్పి ఉంచే దుస్తులు, సాక్స్ వంటివి ధరించకుండా వెళ్లటం మంచిది.
పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లాల్సిన వస్తువులు
TS EAMCET 2025 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి ఈ క్రింది వస్తువులను తీసుకెళ్లాలి. TS EAMCET 2025 అడ్మిట్ కార్డ్ తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్ ఉండాలి. వాటర్ బాటిల్, పెన్ను, పెన్సిల్ మొదలైనవి సామగ్రి తప్పక వెంట తీసుకెళ్లాలి.
Read Also: SSC Exam 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొత్త రూల్.. ఇది లేకపోతే పరీక్షకు నో ఎంట్రీ.. నోటీసు విడుదల
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైన