Free AI Course: నెట్ ఉంటే చాలు! ఇంటి నుంచే గూగుల్ ఫ్రీ ఏఐ కోర్సు.. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్!
ABN , Publish Date - Jun 17 , 2025 | 01:53 PM
Google free AI courses: రాబోయ్ రోజుల్లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ దే హవా అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, సామాన్య ప్రజలకు ఇంటి నుంచే ఉచితంగా ఫ్రీ ఏఐ సర్టిఫికేట్ కోర్సు చేసే అవకాశం కల్పిస్తోంది దిగ్గజ సంస్థ గూగుల్. కంప్యూటర్ లేకపోయినా ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు. అదెలాగంటే..

Free AI certification by Google: ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం యువతకు పెద్ద సవాలే. మారుతున్న టెక్నాలజీ కారణంగా ఏ రంగంలో కెరీర్ స్థిరంగా ఉంటుదో తెలియదు. ఏఐ నేర్చుకుంటే అద్భుత కెరీర్ తథ్యమని ప్రపంచమంతూ కోడై కూస్తున్న నేపథ్యంలోనే.. నిరుద్యోగ యువతకు గూగుల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పనిలేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. కంప్యూటర్ లేకపోయినా ఏ సామాన్యుడైనా చేయగలిగే అద్భుతమైన ఉచిత AI కోర్సులను ప్రారంభించింది. మీరు మీకు అనుకూలమైన సమయంలోనే క్లాసులకు హాజరు కావచ్చు. కోర్సు పూర్తి చేసిన తర్వాత గూగుల్ ఒక సర్టిఫికేట్‌ను కూడా అందిస్తుంది. దాని ఆధారంగా ఉద్యోగం కూడా పొందవచ్చు.
గూగుల్ అనేక ఉచిత AI కోర్సులు అందుబాటులో ఉంచింది. జనరేటివ్ AI, AI లు ఎలా పనిచేస్తాయి.. వ్యాపారాలలో AI వాడకం వంటి అంశాలను కవర్ చేస్తూ కోర్సులు నేర్పిస్తోంది. ఈ కోర్సులు బిగినర్స్ నుంచి వ్యాపార సంస్థల యజమానుల వరకు అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. కోర్సు పూర్తయిన తర్వాత Google సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ కోర్సులను కంప్యూటర్ లేకుండా కూడా పూర్తి చేయవచ్చు.
ఏ AI కోర్సులు పూర్తిగా ఉచితం?
జనరేటివ్ AI: ఈ కోర్సు జనరేటివ్ AI అంటే ఏమిటో మీకు తెలియజేస్తుంది. ఉదాహరణకు ChatGPT లేదా కొత్త కంటెంట్‌ను సృష్టించే AI ఎలా పనిచేస్తుంది. రోజువారీ పనిలో దీనిని ఎలా ఉపయోగించవచ్చో నేర్పిస్తారు. ఇది చాలా ప్రారంభ స్థాయి కోర్సు. పూర్తి చేయడానికి ఒక గంట మాత్రమే పడుతుంది. AI ప్రపంచంలోకి మొదటి అడుగులు వేయాలనుకునే ఎవరికైనా ఈ కోర్సు ఉపయోగకరం.
AI మోడల్స్ ఎలా పని చేస్తాయి?
AI మోడల్స్ ఎలా పని చేస్తాయో.. ప్రాంప్ట్‌లను ఎలా వ్రాయాలో, AIని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.
ఈ కోర్సు వ్యాపారులకు బెస్ట్
మీకు చిన్న వ్యాపారం ఉంటే లేదా భవిష్యత్తులో ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా.. Google అందించే వర్క్‌షాప్‌లో మీ పనిని సులభతరం చేయడానికి, కస్టమర్‌లతో మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి, మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి AI సాధనాలను ఎలా ఉపయోగించాలో దీని ద్వారా నేర్చుకుంటారు.
మీరు ఎక్కడ, ఎలా చదువుకోవచ్చు?
ఈ కోర్సును నేరుగా Google AI లెర్నింగ్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా కోర్సు వెబ్‌సైట్‌ను సందర్శించండి. ai.google/learn-ai-skills / లేదా grow.google/ai/ . మీరు ఈ కోర్సులన్నింటినీ ఇక్కడ నేర్చుకోవచ్చు.
కోర్సును ఎలా ప్రారంభించాలి?
వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు మీకు వివిధ కోర్సులు కనిపిస్తాయి. మీరు చేయాలనుకుంటున్న కోర్సుపై క్లిక్ చేయండి. మీకు Learn More లేదా Get Started అనే బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. కొన్ని కోర్సులు Coursera వంటి వెబ్‌సైట్‌లలో హోస్ట్ చేయబడతాయి. మీరు అక్కడికి వెళ్లి ఉచిత ఖాతాను సృష్టించుకోవాలి. Courseraలో కోర్సులో చేరేటప్పుడు మీరు ఆడిట్ మోడ్ లేదా ఉచిత నమోదును ఎంచుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్.. పోస్ట్‌పెయిడ్ టూ ప్రీపెయిడ్ మరింత ఈజీ
For National News And Telugu News