Share News

IBPS Clerk Recruitment 2025: గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. 10,277 క్లర్క్ పోస్టులకు IBPS నోటిఫికేషన్..

ABN , Publish Date - Aug 02 , 2025 | 08:59 AM

నిరుద్యోగులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న IBPS క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద ఏకంగా పదివేలకుపైగా పోస్టులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. అర్హత, నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..

IBPS Clerk Recruitment 2025: గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. 10,277 క్లర్క్ పోస్టులకు IBPS నోటిఫికేషన్..
IBPS Clerk Notification 2025

బ్యాంకులో ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) భారీ సంఖ్యలో క్లర్క్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో (CRP CSA-XV)10 వేలకు పైగా ఉద్యోగాలకు నియామకాలను చేపట్టనుంది. ఆగస్టు 1 నుంచే దరఖాస్తు ప్రక్రియ ఆరంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు www.ibps.in లేదా ibpsonline.ibps.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


IBPS క్లర్క్ ఖాళీల వివరాలు

IBPS క్లర్క్ అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనేది బ్యాంకులో ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఉద్యోగం. లక్షలాది మంది అభ్యర్థులు దీని కోసం సిద్ధమవుతున్నారు. IBPS దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల్లోని 10,277 క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నియామకాన్ని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో గరిష్ఠ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ ఆగస్టు 2. ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 2025లో జరుగుతుంది. అర్హత, వయోపరిమితి సహా ఇతర ముఖ్యమైన వివరాలు కింద ఉన్నాయి.


అర్హత, వయసుపరిమితి

  • IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థి వయస్సు 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి 1997 ఆగస్టు 2 కి ముందు, 2005 ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండకూడదు.

  • ప్రభుత్వ రిజర్వేషన్ విధానం ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. SC, ST కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. వయస్సు, అర్హతను లెక్కించడానికి కటాఫ్ తేదీ ఆగస్టు 1, 2025.


ఎంపిక ప్రక్రియ, ప్రాథమిక పరీక్ష విధానం

IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష, ఆన్‌లైన్ మెయిన్స్ పరీక్ష. ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థులు మొత్తం 60 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. మొత్తం మార్కులు100. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ (30 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ (35 మార్కులు) నుంచి 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ (35 మార్కులు) నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి.

ప్రధాన పరీక్షా సరళి

మెయిన్స్ పరీక్షలో 160 నిమిషాల్లో మొత్తం 190 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 200. ఇందులో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు (50 మార్కులు), జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 ప్రశ్నలు (40 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు (60 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు (50 మార్కులు) ఉంటాయి. పరీక్షలో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. మెయిన్స్ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే తుది మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది.


జీతం ఎంత?

IBPS క్లర్క్ పోస్టుకు ప్రారంభ జీతం నెలకు రూ. 24,050. అనుభవం, పదోన్నతిని బట్టి నెలకు గరిష్ఠంగా రూ. 64,480 వరకూ ఉండవచ్చు. దీనితో పాటు క్లర్క్‌కు DA, HRA, ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. కాబట్టి, చేతికొచ్చే మొత్తం జీతం మరింత ఎక్కువగా ఉంటుంది.


ఎలా దరఖాస్తు చేయాలి?

  • ముందుగా IBPS అధికారిక వెబ్‌సైట్ www.ibps.in కి వెళ్లండి.

  • హోమ్‌పేజీలో 'IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025' లేదా 'CRP క్లర్క్స్-XV' కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు లింక్‌ను ఓపెన్ చేసి క్లిక్ చేయండి.

  • న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ మొదలైన వాటిని పూరించండి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నంబర్ పాస్‌వర్డ్ అందుతాయి.

  • లాగిన్ అయి మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హత, చిరునామా, ఇతర అవసరమైన సమాచారాన్ని పూరించండి.

  • సూచించిన ఫార్మాట్, సైజులో పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం, ఎడమ బొటనవేలు ముద్ర, చేతితో రాసిన డిక్లరేషన్‌ను అప్‌లోడ్ చేయండి.

  • మీ కేటగిరీ ప్రకారం ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి.

  • ప్రతిదీ జాగ్రత్తగా తనిఖీ చేసి ఆపై అప్లికేషన్ సబ్మిట్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి

కానిస్టేబుల్ ఫలితాలు విడుదల .. ఇలా చెక్ చేసుకోండి

CAT 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పరీక్ష షెడ్యూల్ తెలుసుకోండి

For More Educational News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 09:01 AM