Agniveer Recruitment 2025: గుడ్ న్యూస్.. ఆగస్టు 4 వరకు అగ్నివీర్ దరఖాస్తు గడువు పొడిగింపు..
ABN , Publish Date - Aug 02 , 2025 | 02:56 PM
భారత వైమానిక దళం అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. గతంలో జులై 31 కాగా ఇప్పుడు ఆగస్టు 4 వరకూ పొడిగించారు. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఇప్పుడు నిర్దేశించిన పరీక్ష రుసుము చెల్లించి ఆన్‌లైన్ మోడ్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి.

IAF Agniveer Vayu Recruitment 2025: భారత వైమానిక దళం అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. దేశానికి సేవ చేయాలనుకునే అభ్యర్థులు అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇది రెండో అవకాశం. మీరు అగ్నివీర్ వాయు నియామక పరీక్షకు కూడా సిద్ధమవుతుంటే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని గతంలో జూలై 31 కాగా, ఇప్పుడు ఆగస్టు 4 వరకు పొడిగించారు. అందుకే, అప్లై చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు మరో ఛాన్స్ లభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలంటే భారత వైమానిక దళం agnipathvayu.cdac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
భారత వైమానిక దళంలో అగ్నివీర్ వాయు పోస్టులకు అప్లై చేసుకోవాలని కోరుకునే యువతకు ఉపశమనం కలిగించే వార్త. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించారు. ఇప్పుడు అభ్యర్థులు ఆగస్టు 4, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు గడువు జూలై 31గా కాగా, మరో నాలుగు రోజులు పొడిగించారు. 12వ తరగతి, డిప్లొమా, వృత్తి విద్యా కోర్సులు చేసిన అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం మీరు అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.in ని సందర్శించండి.
అర్హత ప్రమాణాలు
అగ్నివీర్ వాయు నియామక పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు.
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి గణితం, భౌతిక శాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టులలో కనీసం 50% మార్కులతో ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా సబ్జెక్టులో (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ) మొదలైన వాటిలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి.
కనీసం 50 శాతం మార్కులతో రెండేళ్ల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా అర్హులే.
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి. అన్ని వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.550గా నిర్ణయించబడింది.
ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష, శారీరక పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 1 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే, శారీరక ప్రమాణాల పరీక్ష కోసం పురుష అభ్యర్థులు 1.6 కి.మీ. రేసును 7 నిమిషాల్లో, మహిళా అభ్యర్థులు 8 నిమిషాల్లో రేసును పూర్తి చేయాలి.
సేవా సమయంలో సౌకర్యాలు
ఎంపికైన అగ్నివీర్లకు నాలుగు సంవత్సరాల సేవా కాలంలో రూ. 48 లక్షల వైద్య బీమా లభిస్తుంది.
గ్రాట్యుటీకి ఎటువంటి నిబంధన ఉండదు.
సర్వీసు సమయంలో అభ్యర్థులు వైమానిక దళ ఆసుపత్రులు, CSD క్యాంటీన్ సౌకర్యాలను పొందవచ్చు.
సంవత్సరానికి 30 రోజుల సాధారణ సెలవులు లభిస్తాయి. వైద్య సలహాపై అనారోగ్య సెలవులు కూడా లభిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి
కానిస్టేబుల్ ఫలితాలు విడుదల .. ఇలా చెక్ చేసుకోండి
గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. 10,277 క్లర్క్ పోస్టులకు IBPS నోటిఫికేషన్..
For More Educational News And Telugu News