Nara Lokesh: ఈ రోజు నాకెంతో స్పెషల్: మంత్రి నారా లోకేష్
ABN , Publish Date - Aug 02 , 2025 | 02:04 PM
నిత్యం అధికారిక సమావేశాలు, పర్యటనలు, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ బిజిగా ఉంటారు. కానీ, ఈ ఒక్క రోజు దేవాన్ష్ కోసం సెలవు తీసుకున్నా.. ఇవెంతో ప్రత్యేక క్షణాలు అంటూ ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది.

తన దృష్టికి వచ్చిన సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తూ ప్రజలు నిత్యం అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు మంత్రి నారా లోకేష్. ఒకపక్క ఐటీశాఖా మంత్రిగా పెట్టుబడులు రాబట్టేందుకు.. మరోపక్క విద్యాశాఖ అభివృద్ధి కోసం సమావేశాలు నిర్వహిస్తూ, హాజరవుతూ తీరిక లేకుండా గడిపేస్తుంటారు. కానీ, ప్రజా జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి కుటుంబం కోసం.. ముఖ్యంగా తండ్రిగా తన బాధ్యతలను నిర్వర్తించలేదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ, ఈసారి కుమారుడు దేవాన్ష్ కోసం ఒక్కరోజు సెలవు తీసుకున్నా అంటూ కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ అద్భుత క్షణాలు ఎంతో ప్రత్యేకమంటూ రాసుకొచ్చారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ ఆగస్టు 2(శనివారం)న కుమారుడు దేవాన్ష్ స్కూల్లో జరిగిన పేరెంట్స్ మీటింగ్‌కు సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ ఇలా ట్వీట్ చేశారు. 'ఈ రోజు దేవాన్ష్ స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్ కోసం సెలవు తీసుకున్నా. ప్రజా జీవితంలో తీరిక ఉండదు. అందుకే ఇలాంటి క్షణాలు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తాయి. దేవాన్ష్ చిన్ని ప్రపంచం, కథలు, నవ్వు తండ్రిగా నాకెంతో అద్భుతంగా అనిపిస్తాయి. మేం నిన్ను చూసి గర్విస్తున్నాము దేవన్ష్! ' అంటూ రాసుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గత పాలన సైకో పాలన.. ఆర్థిక విధ్వంసం చేసి అందరినీ ఇబ్బంది పెట్టారు
అవినీతికి కేరాఫ్‌గా మారిన ఆర్డీవో కార్యాలయం
Read Latest AP News and National News