Bhadrachalam: భద్రాద్రి దేవస్థానంలో ఈ-ఆఫీసు విధానం..
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:28 PM
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈ-ఆఫీసు విధానం అమలుకు కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో ఈ-ఆఫీసు విధానం అమలు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు ఆదేశించారు.

- అమలుకు కసరత్తు.. ఫైనాన్సియల్ మాడ్యూల్‌ను
- ప్రారంభించిన దేవస్థానం ఈవో రమాదేవి
భద్రాచలం: భద్రాచలం(Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈ-ఆఫీసు విధానం అమలుకు కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో ఈ-ఆఫీసు విధానం అమలు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు ఆదేశించారు. ఈ క్రమంలో ఇప్పటికే హైదారబాద్(Hyderabad)లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ ఆఫీసు విధానంను సైతం అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో భద్రాచలం దేవస్థానం ఈ-ఆఫీసు విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.
ఇందుకు సంబంధించిన ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి చేసేందుకు అధికార వర్గాలు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ఏ దేవస్థానంలో లేని విధంగా భద్రాద్రి దేవస్థానంలో డిజిటలైజేషన్, బార్‌కోడింగ్, ఉచిత అన్నదానంకు కంప్యూటర్ టోకెన్లు, కియా్‌స్కతో పాటు ఇతరత్రా సాంకేతిక పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఖాతాలన్నిటిని ఆన్‌లైన్ ద్వారా ఫైనాన్సియల్ మాడ్యుల్ క్రియేట్ చేసి నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి శుక్రవారం ప్రారంభించారు. భవిష్యత్‌లో ఆర్థికపరకమైన వ్యవహారాల్లో ఎలాంటి అవకతవకలు, పొరపాట్లు, లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఆఫీసు విధానం సైతం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకుంటే భద్రాద్రి దేవస్థానంలో పూర్తి పారదర్శకతకు అవకాశం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు, అంచనాలు, కార్యాలయ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. కాగా భద్రాచలం దేవస్థానంలోని సెంట్రల్ స్టోర్‌లో సైతం ఈ స్టోర్‌ను త్వరలో అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే
సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!
Read Latest Telangana News and National News