Share News

PM Modi Varanasi: పాతాళ లోకంలో దాగినా వదలబోం.. మళ్లీ దాడి చేస్తే మాత్రం..

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:58 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వారణాసిలో జరిగిన భారీ సభలో పాకిస్తాన్‎పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై దాడి చేసే వారు పాతాళ లోకంలో దాక్కున్నా కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

PM Modi Varanasi: పాతాళ లోకంలో దాగినా వదలబోం.. మళ్లీ దాడి చేస్తే మాత్రం..
PM Modi Varanasi

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి(PM Modi Varanasi)లో జరిగిన భారీ సభలో పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. మహాదేవుడికి అనేక రూపాలు ఉన్నాయి. ఒకటి కల్యాణం కోసం, మరొకటి రుద్ర రూపం. ఉగ్రవాదం, అన్యాయం జరిగినప్పుడు మహాదేవుడు రుద్ర రూపం ధరిస్తాడు.

ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచం భారత్ ఈ రూపాన్ని చూసింది. భారత్‌పై దాడి చేసే వారిని పాతాళ లోకంలో ఉన్నా వదిలేది లేదని మోదీ అన్నారు. పాకిస్తాన్ మరో ఉగ్ర దాడికి పాల్పడితే, ఈసారి మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలతో సమాధానం ఇస్తామని హెచ్చరించారు.


ఈ విజయాన్ని సహించలేకపోతున్నారు

ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రశ్నించిన విపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు. కొందరు మన దేశంలోనే ఈ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్, దాని బృందం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం చూసి కలత చెందుతున్నారు. మీకు ఆపరేషన్ సింధూర్ గురించి గర్వంగా లేదా? మన డ్రోన్లు, మిసైళ్లు ఎంత ఖచ్చితంగా ఉగ్ర స్థావరాలను నాశనం చేశాయో చూశారా? పాకిస్తాన్ వైమానిక స్థావరాలు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయని ఎద్దేవా చేశారు.


పాకిస్తాన్ వణుకుతోంది

బ్రహ్మోస్ మిసైళ్ల వల్ల పాకిస్తాన్‌కు నిద్ర పట్టడం లేదు. ఈ క్రమంలో పాక్ మళ్లీ దాడులు చేయాలని చూస్తే, ఉత్తరప్రదేశ్‌లో తయారవుతున్న బ్రహ్మోస్ మిసైళ్లతో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేస్తామని మోదీ హెచ్చరించారు. లక్నోలో బ్రహ్మోస్ తయారీ యూనిట్ త్వరలో ప్రారంభం కానుంది. రక్షణ రంగంలో భారత్‌ స్వయం సమృద్ధిగా మారుతోందని, యూపీ డిఫెన్స్ కారిడార్‌లో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టడం ఇప్పటికే ప్రారంభించాయని ప్రధాని తెలిపారు.


ఉగ్రవాదులకు నాశనం

ఈ సభను ఓం నమః పర్వతి పతయే, హర హర మహాదేవ్ అంటూ ప్రారంభించిన ప్రధాని, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆశీర్వదించమని కాశీ విశ్వనాథుని ప్రార్థించారు. వారి సిందూరానికి ప్రతీకారం తీసుకుంటామని వాగ్దానం చేశాము. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా నెరవేర్చినట్లు చెప్పారు.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 02:01 PM