DRDO Internship 2025: స్టూడెంట్స్‌కు DRDO బంపర్ ఆఫర్.. పెయిడ్ ఇంటర్న్‌షిప్ చేసే ఛాన్స్..
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:39 PM
ఇంజినీరింగ్, సైన్స్ చదివే విద్యార్థులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. 6 నెలల పాటు విద్యార్థులకు పరిశోధన ప్రాజెక్టులలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన వారు జీతంతో పాటు అనుభవమూ సొంతం చేసుకోవచ్చు.

DRDO Internship 2025 Apply Online: DRDO కాలేజీ విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించబోతోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కెరీర్‌ను కొనసాగించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థుల కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ను ప్రకటించింది. ఎంపికైన విద్యార్థులు 6 నెలల పాటు పరిశోధన ప్రాజెక్టులలో పని చేయడానికి అవకాశం పొందుతారు. నెలవారీ స్టైఫండ్ కూడా లభిస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్‌ను DRDL/ASL/CAS హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. చివరి తేదీ దగ్గరపడుతోంది. కాబట్టి, ఆసక్తి కలిగిన విద్యార్థులు DRDO అధికారిక వెబ్‌సైట్ ద్వారా గడువుతేదీలోగా దరఖాస్తు చేసుకోండి.
భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) విద్యార్థులకు పరిశోధనా ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం కల్పిస్తోంది. ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థుల కోసం DRDO స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభించింది. ఈ ఇంటర్న్‌షిప్‌లో మొత్తం 165 సీట్లు రిజర్వులో ఉంటాయి. ఇక, ఎంపికైన విద్యార్థులు 6 నెలల పాటు వివిధ పరిశోధన ప్రాజెక్టులలో పని చేసే అవకాశం పొందుతారు. ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో పాటు ప్రతి నెలా జీతం పొందుతారు. మీరు ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో చేరాలనుకుంటే చివరి తేదీ జులై 18 సాయంత్రం 5 గంటలకు లేదా అంతకు ముందులోగా దరఖాస్తు చేసుకోండి. ఈ ఇంటర్న్‌షిప్‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL) ప్రారంభిస్తుంది .
అర్హత
ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి BE/B.tech చివరి సంవత్సరం లేదా MSc రెండవ సంవత్సరం చదువుతూ ఉండాలి. AICTE లేదా UGC గుర్తించిన సంస్థ నుండి కనీసం 60% మార్కులు లేదా సమానమైన CGPA కలిగి ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే విద్యార్థుల గరిష్ఠ వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు చివరి తేదీ- జులై 18, 2025
ఇంటర్వ్యూ సమాచారం- జులై 22, 2025
ఇంటర్వ్యూ తేదీ- జులై 26, 2025
ఇంటర్న్‌షిప్ ప్రారంభ తేదీ- ఆగస్టు 1, 2025
ఇంటర్న్‌షిప్ వివరాలు:
ఈ ఇంటర్న్‌షిప్ హైదరాబాద్‌లో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లోని DRDL, ASL, CAS ల్యాబ్‌లలో నిర్వహిస్తారు. ఇంటర్న్‌షిప్ మొత్తం వ్యవధి 6 నెలలు. ఎంపికైన విద్యార్థులు ఇంటర్న్‌షిప్ సమయంలో ప్రతి నెలా రూ.5000 స్టైఫండ్ పొందుతారు. ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి DRDO నుంచి అధికారిక సర్టిఫికెట్ కూడా అందుతుంది. ఇది విద్యార్థుల కెరీర్‌కు ఒక బూస్టర్‌గా ఉపయోగపడుతుంది.
దరఖాస్తు ప్రక్రియ:
DRDO వెబ్‌సైట్ drdo.gov.in నుంచి ఇంటర్న్‌షిప్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
ఫారం నింపాక అవసరమైన పత్రాలను జత చేయండి.
ఈ దరఖాస్తును డైరెక్టర్, DRDL, DRDO, మిస్సైల్ కాంప్లెక్స్, కాంచన్‌బాగ్, హైదరాబాద్ - 500058 కు పంపండి.
స్కాన్ చేసిన కాపీని drdlintern2025@gmail.com కు కూడా ఈమెయిల్ చేయండి.
ఇవి కూడా చదవండి
సీడాక్‌లో ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు లేదు, ఏడాదికి రూ. 18 లక్షల జీతం
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం, అర్హతలు ఏంటంటే..
మరిన్ని చదువు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి