డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఫ్రీ ఇంటర్న్‌షిప్.. జీతం గంటకు రూ.3,419..
ABN , Publish Date - Jun 29 , 2025 | 01:19 PM
Bank of America Internship 2025: డిగ్రీ చదివి బ్యాంకింగ్ రంగంలో జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతీ యువకులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ అమెరికా 2025 సంవత్సరానికి గాను ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత కోర్సు ద్వారా అనుభవంతో పాటు డబ్బు కూడా సంపాదించవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Bank of America Summer Internship 2025:ఫైనాన్స్, వ్యాపార రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఉన్నవారికి ఒక గొప్ప అవకాశం వచ్చింది . తాజాగా, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను తీసుకువచ్చింది. ఇందులో చేరినవారు నైపుణ్యాలతో పాటుగా మంచి ఆదాయమూ అందుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ అమెరికా పూర్తి ఉచితంగా అందిస్తున్న ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో చేరిన అభ్యర్థులకు గంటకు 40 డాలర్ల వరకూ అంటే సుమారు రూ. 3,419 ల వరకూ సంపాదించవచ్చు.
బ్యాంక్ ఆఫ్ అమెరికా తన 2025 ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫైనాన్స్, బిజినెస్, అకౌంటింగ్, కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్/మాస్టర్స్ డిగ్రీ ఉన్న గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థికి గంటకు $40 వరకూ జీతం లభిస్తుంది. ఈ కోర్సు ద్వారా అమ్మకాలు, వ్యాపార విశ్లేషణా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం అందుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
బ్యాంక్ ఆఫ్ అమెరికా తన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసిన యువతీ యువకులు, నిపుణులు ఎవరైనా ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానంగా ఎకనామిక్స్, ఫైనాన్స్, బిజినెస్, అకౌంటింగ్, కంప్యూటర్ సైన్స్ రంగాలకు చెందిన వారికి ఈ ఇంటర్న్‌షిప్‌లో ప్రాధాన్యత ఇస్తారు. అయితే అన్ని విభాగాల నుండి గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌లో చేరాలనే ఆసక్తి ఉంటే మీరు ఈ లింక్‌ను ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు .
బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2025 లో ఎంపికైన తర్వాత మీరు సేల్స్, బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేసే అవకాశాన్ని పొందుతారు. దీనితో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా తన సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో ప్రత్యక్ష మార్కెట్ వ్యూహాన్ని రూపొందించడం, కస్టమర్-కేంద్రీకృత విధానాన్ని సిద్ధం చేయడం వంటి నైపుణ్యాలను బోధిస్తుంది.
గంటకు 40 డాలర్లు..
బ్యాంక్ ఆఫ్ అమెరికా సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన వారికి అంతర్జాతీయ నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం దక్కుతుంది. అదే సమయంలో అనుభవంతో పాటు నిపుణులకు గంటకు $40 అంటే రూ. 3,419 చెల్లిస్తారు. ఇక ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీరు ITI పాసయ్యారా? గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తుంటే ఇదే మంచి ఛాన్స్..!
ఐసీఏఐ సీఏ 2025 ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడంటే..
For Educational News And Telugu News