Cyber Crime: ఐ ఫోన్ గెలుచుకున్నారంటూ బురిడీ కొట్టించారు..
ABN , Publish Date - Jan 23 , 2025 | 09:59 AM
ఐ ఫోన్(iPhone) గిఫ్టుగా గెలుచుకున్నారంటూ ఓ యువతిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.1.47 లక్షలు కొట్టేశారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 25 ఏళ్ల యువతి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తోంది.

- ప్రభుత్వ ఉద్యోగిని నుంచి రూ.1.47 లక్షలు కొట్టేసిన క్రిమినల్స్
హైదరాబాద్ సిటీ: ఐ ఫోన్(iPhone) గిఫ్టుగా గెలుచుకున్నారంటూ ఓ యువతిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.1.47 లక్షలు కొట్టేశారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 25 ఏళ్ల యువతి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తోంది. నాలుగురోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్న క్రమంలో ఆమెకు కాస్మెటిక్స్‌కు సంబంధించిన ఒక షాపింగ్ వెబ్‌సైట్ కనిపించింది. ఆ వెబ్‌సైట్(Website)ను ఓపెన్ చేసి రూ. 2000 విలువైన కొన్ని రకాల కాస్మెటిక్స్ ఆర్డర్ చేసింది.
ఈ వార్తను కూడా చదవండి: Begumpet: నాడు అధ్వానంగా.. నేడు ఉద్యానవనంలా
మరుసటి రోజు ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, ‘కంగ్రాట్స్ మేడం.. మీరు షాపింగ్ చేసినందుకు గాను మా సంస్థ తరపున తీసిన లక్కీడ్రాలో ఐ ఫోన్‌ను బహుమతిగా గెలుచుకున్నారు’ అని చెప్పాడు. ఆ బహుమతిని పొందాలంటే మరో రూ. 3000 విలువైన కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందన్నాడు. ఆ డబ్బు రీఫండ్ వస్తుందని నమ్మించాడు. ఓ లింక్ పంపాడు. ఆమె దాన్ని క్లిక్ చేసి, వారు చెప్పినట్లు రూ.3000 ఆన్‌లైన్ షాపింగ్(Online shopping) చేసింది.
ఆమె ఫోన్‌ను హ్యాక్ చేసిన క్రిమినల్స్ డబ్బులు రీ ఫండ్ చేస్తున్నట్లు నమ్మించి ఆమె ద్వారా ఓటీపీలు తెలుసుకున్నారు. అలా మూడు విడతల్లో ఆమె ఖాతాలో ఉన్న రూ. 1,47,967 కొట్టేశారు. డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్‌లు రావడంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నిక్ ఎవిడెన్స్ ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి
ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు
ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?
Read Latest Telangana News and National News