Lorry Theft: వామ్మో.. ఎంతకు తెగించారు.. ఏకంగా ఆగి ఉన్న లారీనే ఎత్తుకెళ్లారుగా..
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:11 PM
పట్టపగలే వాహనాలను ఎత్తుకుపోయేవారు కూడా పెరిగిపోతున్నారు. కొందరు దొంగలైతే ఏకంగా బస్సు, లారీలను కూడా ఎత్తుకుపోవడం చూస్తున్నాం. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది..

రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఇల్లు మొత్తం గుళ్ల చేసేస్తున్నారు. మరోవైపు పట్టపగలే వాహనాలను ఎత్తుకుపోయేవారు కూడా పెరిగిపోతున్నారు. కొందరు దొంగలైతే ఏకంగా బస్సు, లారీలను కూడా ఎత్తుకుపోవడం చూస్తున్నాం. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కొందరు ఆగి ఉన్న లారీని టార్గెట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..
ఎన్టీఆర్ జిల్లా (NTR district) గుడివాడ ఆటోనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ లారీని స్థానిక ప్రాంతంలో ఆపి ఉంచగా.. కొందరు దొంగలు దానిపై కన్నేశారు. ఎవరికీ అనుమానం రాకుండా లారీని స్టార్ట్ చేసుకుని (Lorry theft) అక్కడి నుంచి తీసుకెళ్లారు. లారీని హైదరాబాద్ తీసుకెళ్లి విక్రయించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణంలో సదరు నిందితులు హైదరాబాద్‌కు చెందిన బాలకృష్ణ, మచిలీపట్నానికి చెందిన రామాంజనేయులుగా తెలిసింది. చిల్లకల్లు పోలీసులు.. లారీని స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుడివాడ పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఏకంగా లారీనే చోరీ చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాశంగా మారింది.